ఫ్లిప్ కార్ట్ లో ఆఫర్ల మోత

న్యూఢిల్లీ: ఫ్లిప్‌కార్ట్ విమెన్స్ డే సేల్ ప్రారంభమైంది. నేటి నుంచి రేపటి వరకు రెండు రోజులపాటు జరగనున్న ఈ సేల్‌లో మొబైల్ ఫోన్లు, ట్యాబ్లెట్లు, ల్యాప్‌టాప్‌లు, టీవీలు, ఇంకా పలు గాడ్జెట్లపై బోల్డన్ని ఆఫర్లు ప్రకటించింది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు డెబిట్, క్రెడిట్ కార్డు యూజర్లకు నోకాస్ట్ ఈఎంఐ వంటి ఆప్షన్లు కూడా ఉన్నాయి.

ఆసుస్, షియోమీ, శాంసంగ్, ఆనర్, యాపిల్ తదితర కంపెనీల ఉత్పత్తులపై ఫ్లిప్‌కార్ట్ భారీ రాయితీలు ప్రకటించింది. విమెన్స్ డే సేల్‌తోపాటు ఫ్లిప్‌కార్ట్ ఫ్లాష్ సేల్‌ కూడా నిర్వహించనుంది. విమెన్స్ డే సేల్‌లో భాగంగా జెన్‌ఫోన్ 5జడ్‌పై రూ.3 వేలు, జెన్‌ఫోన్ లైట్ ఎల్1పై రూ.1,000, జెన్‌ఫోన్ మ్యాక్స్ ఎం1, జెన్‌ఫోన్ మ్యాక్స్ ప్రొ ఎం1పై రూ.500 చొప్పున రాయితీ ప్రకటించింది.

షియోమీ రెడ్‌మీ నోట్ 6 ప్రొ (4జీబీ ర్యామ్, 64 జీబీ)ను రూ.10,999, పోకో ఎఫ్1 (6జీబీ, 64 జీబీ.. 6జీబీ, 128 జీబీ)ను కొనుగోలు చేసే వారికి పాత స్మార్ట్‌ఫోన్ ఎక్స్చేంజ్‌పై అదనంగా రూ.2 వేల వరకు రాయితీ ఇస్తోంది. పోకో ఎఫ్ 1 (8 జీబీ ర్యామ్, 256 జీబీ)ని కొనుగోలు చేసే వారికి ఎక్స్ఛేంజ్‌పై రూ.3 వేల వరకు రాయితీ ఇస్తోంది. వీటితోపాటు వివో వి11, ఒప్పో ఎఫ్9లపైనా రూ.3 వేల వరకు ఎక్స్ఛేంజ్ ఆఫర్ ఉంది. వీటితోపాటు కెమెరాలు, ల్యాప్‌టాప్‌లు, ఆడియో గేర్, ట్యాబ్లెట్లు, స్మార్ట్‌హోం ప్రొడక్ట్‌లు వంటివాటిపై రాయితీలు ప్రకటించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *