రెడ్ మీ 48 మెగా పిక్సెల్ ఫోన్ ధర ఎంతో తెలుసా ?

న్యూఢిల్లీ: చైనీస్ మొబైల్ మేకర్ షియోమీ నుంచి మరో అద్భుతమైన ఫోన్ వచ్చేసింది. రెడ్‌మీ నోట్ 7 ప్రొ పేరుతో వచ్చిన ఈ ఫోన్‌లో 48 మెగాపిక్సల్ కెమెరా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఇందులో రెండు వేరియంట్లు ఉన్నాయి. 4జీబీ+64 జీబీ వేరియంట్ ధర రూ.13,999 కాగా, 6జీబీ+128 జీబీ వేరియంట్ ధర రూ.16,999. మార్చి 13న మధ్యాహ్నం 12 గంటల నుంచి ఈ ఫోన్ వినియోగదారులకు అందుబాటులోకి రానుంది. ఎంఐ డాట్ కామ్, ఫ్లిప్‌కార్ట్, ఎంఐ హోం స్టోర్లు, ఎంపిక చేసిన ఆఫ్‌లైన్ రిటైల్ స్టోర్ల ద్వారా కొనుగోలు చేసుకోవచ్చు. 

రెడ్‌మీ నోట్ 7 ప్రొ స్పెసిఫికేషన్లు

6.3 అంగుళాల ఫుల్ హెచ్‌డీ + స్క్రీన్, వాటర్ డ్రాప్ స్టైల్ నాచ్, ముందు, వెనక 2.5డి కర్వ్‌డ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్, ఆక్టాకోర్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 675 ప్రాసెసర్, ఎస్డీ కార్డు ద్వారా 256 జీబీ వరకు అంతర్గత మెమొరీని పెంచుకునే వెసులుబాటు ఉన్నాయి. వెనక 48 మెగాపిక్సల్ +5 ఎంపీ డ్యూయల్ కెమెరా, 13 ఎంపీ సెల్ఫీ కెమెరా ఉన్నాయి. ఆండ్రాయిడ్ పీ ఓఎస్‌తో పనిచేసే రెడ్‌మీ నోట్ 7 ప్రొలో 4,000 ఎంఏహెచ్ సామర్థ్యం కలిగిన బ్యాటరీని ఉపయోగించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *