శాండిస్క్‌ నుంచి 1టిబి మైక్రోఎస్‌డికార్డు

న్యూఢిల్లీ: చిప్‌లు, ఎస్‌డికార్డ్‌ల తయారీ కంపెనీ శాండిస్క్‌ ఇపుడు ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా ఒక టిబి సామర్ధ్యం ఉన్న మైక్రోఎస్‌డి కార్డును మార్కెట్‌కు ప్రవేశపెడుతున్నది. ఇటీవల బార్సిలోనాలో నిర్వహించిన మొబైల్‌ వరల్డ్‌కాంగ్రెస్‌లో ఈ సిమ్‌కార్డును ప్రదర్శనకు తెచ్చింది. ప్రస్తుత తరం స్మార్ట్‌ఫోన్ల వినియోగాన్ని దృష్టిలో ఉంచుకుని ఎక్కువ రిజొల్యూషన్‌ ఉన్న వీడియోలను సైతం నిక్షిప్తంచేసుకునేవిధంగా ఎక్కువగా బిల్టిన్‌ స్టోరేజి ఆప్షన్లతో వస్తున్నాయి. వీటన్నింటినీ పరిగణనలోనికి తసీఉకున్న శాండిస్క్‌ ఎక్స్‌ట్రీమ్‌ ఒక టిబి స్థాయి మెమరీకార్డును మార్కెట్‌కు తెస్తోంది. దీనివల్ల ఎక్కువ నాణ్యతతో కూడిన ఫోటోలు, వీడియోలు స్మార్ట్‌ఫోన్లు, డ్రోన్లద్వారాను చిత్రించి నిక్షిప్తంచేసుకునే అవకావం కల్పిస్తోంది. యాక్షన్‌ కెమేరాలకుసైతం ఈ చిప్‌ అందుబాటులో ఉంటుంది. సెకనుకు 160 ఎంబి స్పీడుతో ఫైళ్లు ట్రాన్సఫర్‌చేసుకోవచ్చు. ఈ ఏడాది ఏప్రిల్‌నుంచి ఎంపికచేసిన రిటైలర్లవద్ద అందుబాటులో ఉంటుంది. ధర 499.99 డాలర్లుగా ఉంది. 512 జిబి కెపాసిటీ శాండిస్క్‌ ఎక్స్‌ట్రీమ్‌ కార్డులుసైతం అందబుటలోనికి వచ్చాయి. 199.99 డాలర్లుగా ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *