‘ట్రాయ్’ పై విరుచుకుపడ్డ వొడాఫోన్‌ సీఈవో నిక్‌ రీడ్‌

ముంబయి: భారత్‌లో ప్రస్తుతం ఉన్న టెలికాం నిబంధనలు అందరికీ ఒకే విధంగా లేవని వొడాఫోన్‌ సీఈవో నిక్‌ రీడ్‌ అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రస్తుతం తమ సంస్థ కష్టకాలంలో ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ”మేము ఒకటే అడుగుతున్నాం. అందరికి నిబంధనలు ఒకటేలా ఉండాలని కోరుతున్నాం. గత రెండేళ్లలో వచ్చిన కొత్త నిబంధనలు అన్నీ చాలా వరకు మార్కెట్లో ఉన్న సంస్థలకు వ్యతిరేకంగానే ఉన్నాయి.. ఒక్క జియోకు తప్ప. ఈ విషయాన్ని మేము కచ్చితంగా చెప్పగలం.” అని పేర్కొన్నారు. భారతీయ నియంత్రణ, విధానాలపై ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

ప్రస్తుతం భారత్‌లో ఉన్న అతి తక్కువ మొబైల్‌ సర్వీసు రేట్లు ఏమాత్రం గిట్టుబాటుకావని నిక్‌ పేర్కొన్నారు. ”మార్కెట్లోని మూడు సంస్థలు నగదు కొరతతో ఇబ్బంది పడుతున్నాయి. ప్రస్తుతం భారత్‌లో ధరలు చాలా తక్కువ ఉన్నాయి. ఇక్కడ నెలకు సగటున 12జీబీ వాడుతున్నారు. ఇంత తక్కువ ధరలను ప్రపంచంలో ఎక్కడా చూడలేము. ఇక్కడ ధరలు పెరగాలి. అంటే ఒక్కసారిగా చుక్కల్ని తాకాలని కాదు.. మధ్యస్థంగా ధరలు పెరిగినా సరిపోతుంది.” అని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *