5జీ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసిన జడ్‌టీఈ

మొబైల్స్ తయారీదారు జడ్‌టీఈ తన నూతన స్మార్ట్‌ఫోన్ ఆగ్జాన్ 10 ప్రొ 5జి ని మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ (ఎండబ్ల్యూసీ) 2019 ప్రదర్శనలో విడుదల చేసింది. ఇందులో 6.47 ఇంచుల ఫుల్ హెచ్‌డీ ప్లస్ అమోలెడ్ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. 6జీబీ ర్యామ్‌ను ఇందులో అందిస్తున్నారు. వెనుక భాగంలో 48, 20, 8 మెగాపిక్సల్ ట్రిపుల్ బ్యాక్ కెమెరాలు ఉండగా ముందు భాగంలో 20 మెగాపిక్సల్ కెమెరాను ఏర్పాటు చేశారు. ఇక ఈ ఫోన్‌లో 5జీ ఫీచర్‌ను అందిస్తున్నారు. 4000 ఎంఏహెచ్ బ్యాటరీని ఈ ఫోన్‌లో ఏర్పాటు చేశారు. దీనికి ఫాస్ట్ చార్జింగ్, వైర్‌లెస్ చార్జింగ్ ఫీచర్‌ను అందిస్తున్నారు. ఈ ఫోన్ లో ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను ఏర్పాటు చేశారు. ఇక ఈ ఫోన్ ధర వివరాలను ఇంకా వెల్లడించలేదు.

జడ్‌టీఈ ఆగ్జాన్ 10 ప్రొ 5జీ ఫీచర్లు…

 • 6.47 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ అమోలెడ్ డిస్‌ప్లే,
 • 1080 x 2340 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్‌,
 • ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 855 ప్రాసెసర్‌,
 • 6 జీబీ ర్యామ్‌,
 • 128 జీబీ స్టోరేజ్‌,
 • 512 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్‌,
 • ఆండ్రాయిడ్ 9.0 పై,
 • డ్యుయల్ సిమ్,
 • 48, 20, 8 మెగాపిక్సల్ ట్రిపుల్ బ్యాక్ కెమెరాలు,
 • 20 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా,
 • ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌,
 • డ్యుయల్ 4జీ వీవోఎల్టీఈ,
 • వైఫై 802.11 ఏఎక్స్‌,
 • బ్లూటూత్ 5.0,
 • యూఎస్‌బీ టైప్ సి,
 • ఎన్ఎఫ్‌సీ,
 • 4000 ఎంఏహెచ్ బ్యాటరీ,
 • ఫాస్ట్ చార్జింగ్‌,
 • వైర్‌లెస్ చార్జింగ్‌.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *