80కు చేరిన అస్సాం కల్తీ సారా మృతులు

గువహటి : కల్తీసారా కాటుకు బలైన అస్సాం టీ తోట కార్మికుల సంఖ్య 80కు చేరుకుంది. మరో 300 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. గోలాఘాట్‌, జోర్‌హట్‌ జిల్లాలో చోటుచేసుకున్న వేర్వేరు ఘటనలపై దర్యాప్తు జరపాలని అస్సాం ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఓ కార్యక్రమం సందర్భంగా గురువారం రాత్రి వీరంతా కల్తీ సారాను సేవించారని పోలీసులు తెలిపారు. వీరందరిని స్థానిక ఆసుపత్రుల్లో చేర్చామని పేర్కొన్నారు. సమీప జిల్లాలలోని మెడికల్‌ కాలేజ్‌ల నుండి వైద్యులను జోర్‌హాట్‌లోని ఆసుపత్రికి తరలించడంలో జాప్యం చోటుచేసుకుందని రాష్ట్ర ఆరోగ్య మంత్రి, బిజెపి సీనియర్‌ నేత హిమాంత బిస్వా శర్మ అంగీకరించారు. కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ మృతులక సంతాపం వ్యక్తం చేశారు. ఈ కల్తీసారాను గోల్‌ఘాట్‌లోని సల్మారా టీ తోటల్లో పనిచేస్తున్న కార్మికులకు సరఫరా చేసిన తల్లి, కొడులకులు కూడా మృతి చెందారు. కేసు నమోదు చేశామని ఇప్పటి వరకు ఇద్దరిని అరెస్ట్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *