జమ్మూకశ్మీర్ లో మరో ఐఈడీ పేలుడుతో దాడి..

పుల్వామా ఉగ్ర దాడి ఘటన గాయం నుంచి కోలుకోకముందే.. మరో దుర్ఘటన జరిగింది. లైన్ ఆఫ్ కంట్రోల్ సమీపంలోని రాజోరీ సెక్టార్‌లో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఆర్మీ మేజర్ ఒకరు అమరుడయ్యారు. నౌషరా సెక్టార్‌ సమీపంలోని ఎల్‌ఓసీ వెంబడి అమర్చిన ఐఈడీని నిర్వీర్యం చేస్తున్న సమయంలో అది ఒక్కసారిగా పేలింది. నియంత్రణ రేఖ వెంబడి పాక్‌కు చెందిన చొరబాటుదారులు ఈ ఐఈడీని ఏర్పాటు చేసి ఉంటారని అధికారులు అనుమానిస్తున్నారు. నౌషరా సెక్టార్‌లోని ఎల్‌ఓసీ వెలుపల 1.5 కిలోమీటర్ల దూరంలో ఈ ఐఈడీని అమర్చారు. జమ్ముకశ్మీర్‌లో భద్రతపై కేంద్రహోంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ సమీక్షించిన గంటల వ్యవధిలోనే ఇది జరగడం కలకలం రేపుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *