కోడలి కోసం కొడుకునే చంపిన తండ్రి

కొడలిపై కన్నేసిన ఓ వ్యక్తి సొంత కొడుకునే కిరాతకంగా హతమార్చాడు. అనంతరం శవాన్ని ముక్కలు ముక్కలుగా కోసి డ్రైనేజీలో పడేశాడు. సభ్యసమాజం తలదించుకునే ఈ ఘటన పంజాబ్ లోని ఫరిదోకోట్ లో చోటుచేసుకుంది. ఫరిదోకోట్ కు చెందిన ఛోటా సింగ్(62) కోడలు జస్వీర్ కౌర్ పై కన్నేశాడు. అడ్డుగా ఉన్న కుమారుడిని చంపేస్తే ఆమెను పెళ్లి చేసుకోవచ్చని భావించాడు.

ఈ నేపథ్యంలో కొడుకు రాజ్విందర్ సింగ్ నిద్రపోతుండగా పదునైన ఆయుధంతో హత్య చేశాడు. ఆ తర్వాత శవాన్ని ముక్కలుముక్కలుగా కోసేసి డ్రైనేజీలో పడేశాడు. అయితే ఈ శబ్దానికి మేలుకున్న మేనల్లుడు గురుచాన్ సింగ్ గదంతా రక్తంతో నిండి ఉండటాన్ని చూశాడు. వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. రంగంలోకి దిగిన అధికారులు ఛోటా సింగ్ ను అదుపులోకి తీసుకున్నారు.

ఈ విషయమై పోలీస్ ఉన్నతాధికారి మాట్లాడాుతూ.. రాజ్విందర్-జస్వీర్ కు 12 ఏళ్ల క్రితం వివాహం అయిందని తెలిపారు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారన్నారు. నిందితుడిని అరెస్ట్ చేశామనీ, కోర్టు ముందు హాజరుపరుస్తామని పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *