జనసైన్యంతో కామ్రేడ్ ముప్పాళ్ల నాగేశ్వరరావు నామినేషన్

మంగళగిరి : ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలు రోజురోజుకు వేడెక్కుతున్నాయి, నిన్న మొన్నటి వరకు కేవలం రెండు పార్టీలకు మాత్రమే పోటాపోటీ పోరు నడిచిన సంగతి అందరికి తెలిసిందే. జనసేన రాకతో ఇది కాస్త త్రిముఖ పోరుగా మారింది. ఎన్నికల సమయం కూడా ఎంతో దూరంలో లేకపోవడంతో ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా నామినేషన్ల పర్వం నడుస్తుంది. తాజాగా మంగళగిరి నియోజకవర్గంలో జనసేన, సిపిఎం, BSP పార్టీలు బలపరిచిన సిపిఐ అభ్యర్థి కామ్రేడ్ శ్రీ ముప్పాళ్ల నాగేశ్వరరావు గారు సోమవారంనాడు నామినేషన్ దాఖలు చేసారు.

మంగళగిరి గాలిగోపురం నుండి మొదలైన ఈ కార్యక్రమానికి నియోజకవర్గ జనసైనికులు, BSP మరియు కమ్యూనిస్టు కార్యకర్తలు వేలాదిగా హాజరయ్యారు. రెండు రోజుల క్రితం జరిగిన టీడీపీ, వైస్సార్సీపీ పార్టీలకు ధీటుగా జనసముద్రం మంగళగిరి నగర వీధులని ముంచెత్తింది. జనసైనికులు మరియు కార్యకర్తల భారీ ర్యాలీ నడుమ గాలిగోపురం నుండి రిటర్నింగ్ ఆఫీసర్ కార్యాలయం చేరుకొని నామినేషన్ అందచేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *