జనసేన తరపున బరిలో నిలిచే వారి వివరాలు ఇవే

రాజకీయాలలోకి కొత్త తరం రావాలన్న జనసేనాని శ్రీ పవన్ కళ్యాణ్ గారు  సంకల్పానికి అనూహ్య స్పందన లభించింది.జనసేన తరపున ఎన్నికల బరిలో నిలుస్తామని ధృడమైన ఆకాంక్షను వ్యక్తం చేస్తూ 2410 బయో -డేటాలు సమర్పించగా ఎక్కువ శాతం అభ్యర్థులు రాజకీయాలకు కొత్త వారే..అయితే అందులో రాజకీయ ఉద్దండుల్ని సైతం ఢీకొట్టగల వారు గణనీయంగా వున్నారు దరఖాస్తులు సమర్సించిన వారిలో80 శాతం మంది 50 సంవత్సరాల వయస్సు లోపు వారు కావడం గమనార్హం.

ఫిబ్రవరి 13 వ తేదీ నుంచి 25 వ తేదీ వరకు బయో-డేటాల స్వీకరణ ప్రక్రియ విజయవాడ నగరంలో జరిగిన సంగతి విదితమే. శాసనసభ ఎన్నికల కోసం 2087 , పార్లమెంట్ కోసం 323 బయో-డేటాలు అందాయి. రాజకీయాలలోకి మేధావులు,విద్యావంతులు,యువతీ యువకులు రావాలని లేనిపక్షంలో మన రాజకీయ వ్యవస్థ దోపిడీదారులతో నిండిపోతుందని శ్రీ పవన్ కళ్యాణ్ గారు మనవి చేస్తూనే వున్నారు. ప్రస్తుతం అందిన బయో-డేటాలు చూస్తుంటే శ్రీ పవన్ కళ్యాణ్ గారు పిలుపుకి ఘనమైన స్పందనే లభించింది. 570 మంది మహిళలు పోటీ చేయడానికి ముందుకు వచ్చారు.140 మంది న్యాయవాదులు,113 మంది ఐ.టి, ఇంజినీర్లు, 65 మంది డాక్టర్లు,41 మంది లెక్చరర్లు,29 మంది జర్నలిస్టులు,22 మంది ప్రొఫెసర్లు,10 మంది సైనికులు, 8 మంది చార్టెడ్ అకౌంటెంట్లు,ఐ.ఏ.ఎస్.,ఐ.పి.ఎస్. క్యాడర్ లో పనిచేసిన ఇద్దరు,న్యాయమూర్తిగా సేవలు అందించిన ఒకరు … పోలీస్,ప్రభుత్వ సర్వీసులలో వున్నవారు ఇలా అనేక రంగాలకు చెందిన వారు  జనసేన తరపున పోటీచేయడానికి సంసిద్ధత వ్యక్తం చేసారు.

అంతేగాకుండా ఎస్.సి.,ఎస్.టి. రిజర్వ్ డ్ సెగ్మెంట్ల నుంచి పోటీచేయడానికి ఉన్నత విద్యావంతులు,ఆడపడుచులు ముందుకు రావడం జనసేన పార్టీ పట్ల ఆ వర్గాలలో నెలొకొన్న నమ్మకాన్ని తెలియచేస్తోంది. 659 మంది వ్యాపారవేత్తలు, 169 మంది రైతులు   మేముసైతం జనసేన తరపున పోరు సలుపుతామంటున్నారు. 945 మంది గ్రాడ్యుయేట్లు,720 మంది పోస్ట్ గ్రాడ్యుయేట్లు, 30 మంది పి.హెచ్ డి పట్టభద్రులు దరఖాస్తు చేసిన వారిలో వున్నారు. 

అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లా నుంచి 275 , ఆ తరువాత రెండు స్థానాలలో కృష్ణ నుంచి 256 , గుంటూరు జిల్లా నుంచి 243 బయో-డేటాలు అందాయి. అదేవిధంగా అత్యధికంగా  విజయవాడ ఈస్ట్ నుంచి 42 , పిఠాపురం,గుంటూరు ఈస్ట్ నుంచి 29 చొప్పున బయో-డేటాలు సమర్పించారు. కాగా పశ్చిమగోదావరి జిల్లా  దెందులూరు స్థానం నుంచి పోటీచేయడానికి ట్రాన్స్ జెండర్ ఒకరు ముందుకు వచ్చారు. మరిన్నివివరాలను అంశాల వారీగా  ఈ దిగువ పేర్కొన్నపట్టికలో పొందుపరిచాము.

అందిన బయో-డేటాలను స్క్రీనింగ్ కమిటీ పూర్తిగా అధ్యయనం చేశాక అర్హుల జాబితాను పార్టీ జనరల్ బాడీ ముందు ఉంచుతుంది. స్క్రీనింగ్ కమిటీ అధ్యయనం ప్రారంభం అయింది. అభ్యర్థుల సామర్థ్యం పై జనరల్  బాడీ అంచనా జరిపించి తుది  జాబితాను పార్టీ అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు కు సమర్పిస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *