మంగళగిరి : జనసేనతోనే సామజిక న్యాయం సాధ్యం

మంగళగిరి : రాజధాని అమరావతికి కూతవేటు దూరంలో ఉన్నటువంటి మంగళగిరి నియాజకవర్గంలో రాజకీయ దుమారం రేగింది. సీపీఐ, సిపిఎం లతో పొత్తులో భాగంగా జనసేన మంగళగిరి నియోజక వర్గాన్ని సిపిఐ కు కేటాయించింది. ఐతే ఈ నిర్ణయంపై నియోజక వర్గంలో జనసేన సీటుపై ఓ స్పష్టత వచ్చినందుకు జనసేన నాయకులు, జనసైనికులు ఒకింత హర్షం వ్యక్తం చేస్తూనే మరోవైపు అభ్యర్థి ఎవరనే విషయంపై ఉత్సుకతతో ఉన్నారు.

అస్సలు విషయాల్లోకి వస్తే, ప్రస్తుత ఎన్నికల్లో మంగళగిరి నియోజకవర్గం ఎంతో కీలకమైనది ఇక్కడ విజయ కేతనం ఎగురవేయడం ప్రతి పార్టీకి అవసరమే. అందులో భాగంగానే అధికార పక్షమైన తెలుగుదేశం నారా లోకేష్ ను బరిలోకి దింపగా, ప్రతిపక్ష పార్టీ సిట్టింగ్ MLA ఐనటువంటి ఆళ్ల రామకృష్ణ రెడ్డినే మళ్ళీ ఖరారు చేసింది. ఇటువంటి క్లిష్టమైన పరిస్థితిని ఎదుర్కొనేందుకు స్థానిక నాయకులు, జనసైనికులు ఎంతగానో శ్రమించి జనసేన పార్టీను మరియు గాజు గ్లాసును ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లి పార్టీ బలాన్ని ద్విగుణీకృతం చేసారు. ఇటువంటి తరుణంలో సిపిఐ కు సీటు కట్టబెట్టడం వారందరిని ఆశ్చర్యానికి గురి చేసిందని బీసీ సంఘ నాయకులు, చేనేత సంగం మరియు పద్మశాలి నాయకులు వారి అభిప్రాయాన్ని వ్యక్తం చేసారు.

జనసేనతోనే సామిజిక న్యాయం సాధ్యం

మిగతా రాజకీయ పార్టీలకు బిన్నంగా ఒక కొత్త ఒరవడిని సృష్టించిన పార్టీ జనసేన అని అందరికి తెలిసిన విషయమే ఐతే మంగళగిరి నియోజకవర్గంలో అత్యధికంగా ఉన్న బీసీ లకు అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం కల్పించకపోతే సామజిక న్యాయం జరిగినట్టు ఎలా అవుతుంది అని అన్ని రాజకీయ పార్టీలను రెండు రోజుల క్రితమే ప్రశ్నించారు. జనసేన మాత్రమే బీసీ లకు సామజిక న్యాయం చేయగలదు అని తామంతా ప్రగాఢ విశ్వాసంతో ఉన్నామని తెలిపారు.

శనివారం నాడు జనసేన అభ్యర్థిత్వం ఆశిస్తున్న ఆశావహులు అంతా కలిసి పార్టీ రానున్న ఎన్నికల్లో చేయాల్సిన ప్రచార కార్యాచరణ గురించి అదే విధంగా పార్టీ బలోపేతానికి చేపట్టవలసిన ముఖ్య కార్యక్రమాల గూర్చి చర్చించారు, ఇందులో చిల్లపల్లి శ్రీనివాస్, తమ్మిశెట్టి జానకి దేవి కూడా పాల్గొని పలు అంశాలపై తీర్మానాలు చేసారు.

janasena mangalagiri
janasena mangalagiri

ఈ పరిణామానికి ముందు మంగళగిరి అభ్యర్థి రేసులో జనసేన తరఫునుండి తమ్మిశెట్టి జానకి దేవి కూడా ఉన్నారు. నియోజకవర్గంలో జరిగిన 2004 మరియు 2009 ఎన్నికలో రెండు సార్లు పోటీ చేసి 40 ,000 ఓట్లతో ద్వితీయ స్థానం లో నిలిచారు. కాగా అదే ఎన్నికలో కమ్యూనిస్టులు 25 ,000 ఓటు బ్యాంకును సాధించారు. ఈ 10 సంవత్సరాల కాల వ్యవధిలో చాల మార్పులు వచ్చి ఉండవచ్చు కానీ కొద్దిగా కృషి చేస్తే గెలిచేందుకు అవకాశాలు మెండుగా ఉన్నాయి అని మంగళగిరి బీసీ నాయకులు మరియు పద్మశాలి వర్గాల ధృడ విశ్వాసం.

source : Wikipedia

బీసీ లు అత్యధికంగా ఉన్నటువంటి మంగళగిరి నియోజకవర్గానికి ఏ రాజకీయ పార్టీ కూడా సామజిక న్యాయాన్ని చేకూర్చలేదు, అటు తెలుగు దేశం నారాలోకేష్ కు కట్టబెడితే ఇటు వైస్సార్సీపీ ఆళ్ల రామ కృష్ణ రెడ్డి కు కట్టబెట్టి కుల పార్టీలు అని నిరూపించుకున్నాయి. ఇటువంటి సమయంలో జనసేన కూడా బీసీ లకు ప్రాధాన్యత కల్పించకపోతే రానున్న 5 సంవత్సరాలు మంగళగిరి చేనేత మరియు పద్మశాలి వర్గ ప్రజలకు గడ్డు రోజులుగా మారే అవకాశం లేకపోలేదు అని వారి భాధను వ్యక్తం చేసారు. జనసేన నాయకులు జనసేనాని ఐన శ్రీ పవన్ కళ్యాణ్ గారు సున్నితమైన ఈ అంశాన్ని మరొకసారి పరిశీలించి నియోజకవర్గ బీసీ ప్రజలకు న్యాయం చేకూర్చుతారు అనే నమ్మకం వారందరి మనస్సులో ధృడంగా పాతుకుపోయి ఉంది అని అలాగే ఏది ఏమైనా తుది శ్వాస వరకు తామంతా జనసైనికులమే అని తెలిపారు.

2019 ఎన్నికలలో మంగళగిరి నియోజకవర్గానికి సామజిక న్యాయం జరిగేటట్లుగా అధికార ప్రతిపక్షాలకు బుద్ధి చెపుతూ పార్టీని మరింత బలోపేతం చేసి విజయకేతనం ఎగురవేసేందుకు తామంతా సిద్ధంగా ఉన్నామని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *