మంగళగిరిలో ఊపందుకున్న జనసేన

మంగళగిరి : ఈరోజు అనగా 16 -03 -2019 న మంగళగిరి నియోజకవర్గ అభ్యర్థిత్వం ఆశిస్తూ జనసేన పార్టీకి ధరఖాస్తు అందచేసిన ఆశావహులు అందరూ హాయిలాండ్ దగ్గర ఉన్నటువంటి బుద్ధ సర్క్యూట్ కాన్ఫరెన్స్ హాలులో సమావేశమయ్యారు.

నియోజకవర్గంలో జనసేన పార్టీ బలోపేతమే ముఖ్య ఉద్దేశంగా సాగిన ఈ సమావేశంలో జనసేన పార్టీ మంగళగిరి అసెంబ్లీ అభ్యర్థిత్వం కోసం దరఖాస్తులు అందచేసిన చిల్లపల్లి శ్రీనివాస్ గారు, చందు భారతి గారు, తమ్మిశెట్టి జానకి దేవి గారు, కంకణాల శంకర్ గారు, చిరసాని రత్నాంజన్ గారు, కుప్పాల రామకృష్ణ గారు మాట్లాడుతూ పలు అంశాలను తీర్మానించారు.

  • జనసేన అధిష్టానం ఎవరిని అభ్యర్థిగా కేటాయించిన సరే తామంతా కలిసి ఉండి పార్టీ విజయానికి సమిష్టిగా కృషి చేస్తామని తెలిపారు.
  • అధికార, ప్రతిపక్ష పార్టీ అభ్యర్థులు ఆర్ధికంగా ఎంత బలమైన వారైనప్పటికీ జనసేన పార్టీ యొక్క జనబలంతో, జనసేనాని పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులతో మంగళగిరిలో విజయకేతనం ఎగురవేస్తామని భరోసా వ్యక్తం చేసారు.
  • రేపు జరగబోయే పార్టీ విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశానికి జనసేన నాయకులు, జన సైనికులు, వీరమహిళలు వేలాదిగా తరలి వచ్చి ఈయొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా పిలుపునిచ్చారు.

ఈరోజున జరిగిన సమీక్షలో రావి రమా,RK ,చందు శ్రీనివాస్,చిల్లపల్లి భాస్కర్, SK ఖైరుల్లా, దాసరి కిరణ్ కుమార్, బన్నీ, గోపి తదితరులు పాల్గొన్నారు.జనసేన పార్టీ

మంగళగిరి నియోజకవర్గం
జై జనసేన జైహింద్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *