రైతులతో మమేకమైన జనసేన నేత అశోక్ బాబు

రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంతోపాటు, కౌలు రైతులను అన్ని విధాలా ఆదుకుంటామని తుని నియోజకవర్గ జనసేన నేత, మాజీ ఎమ్మెల్యే రాజా అశోక్ బాబు స్పష్టం చేశారు. జన తరంగం కార్యక్రమాల్లో భాగంగా జనసేన పార్టీ శ్రేణులతో కలిసి అశోక్ బాబు రైతు బజార్ లో రైతులతో మమేకమయ్యారు. రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. జనసేన పార్టీ అధికారంలోకి వస్తే పవన్ కళ్యాణ్ నేతృత్వంలో రైతులకు మేలు జరుగుతుందని ఆయన భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమం లో జనసేన నాయకులు చోడిశెట్టి గణేష్, అంకంరెడ్డి సత్యనారాయణ, బోనం చినబాబు, డి చిరంజీవి రాజు, శ్రీనివాసరాజు, డి వెంకట రాజు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *