2019లో నేను సిఎం కాకుండా ఎవ్వ‌రు ఆపుతారో చూద్దాం : పవన్

  • సీఎం మళ్ళీ మోసం చేస్తున్నారు 
  • విజ‌య‌న‌గ‌రం వ‌చ్చి మీ సంగ‌తి తేలుస్తా
  • టీడీపీతో గానీ, వైసీపీతో గానీ పొత్తు పెట్టుకోవ‌డం లేదు
  • మ‌నం ప‌ల్ల‌కీలు మోసింది చాలు
  • ఒంట‌రిగానే బ‌రిలోకి దిగుతాం

కడప బహిరంగ సభలో జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ ముఖ్య‌మంత్రి గారు మ‌హిళ‌ల అకౌంట్ల‌కి డ‌బ్బులు వేస్తామంటూ ప‌థ‌కాలు పెట్టారు. ఒక సీజ‌న్‌కి ఇచ్చారు. ఆడ‌ప‌డుచుల మీద నిజంగా ప్రేమే ఉంటే ప్ర‌భుత్వం వ‌చ్చిన నాటి నుంచి ఇవ్వొచ్చుగా, ఎన్నిక‌ల ముందు ఎందుకు ఇస్తున్నారు. అంటే మ‌ళ్లీ మోసం చేస్తున్నారు. నేను మీకంద‌రికీ హామీ ఇస్తున్నా జ‌న‌సేన ప్ర‌భుత్వంలో కుటుంబ కార్డు ఆధారంగా నెల‌కి రూ 2500 నుంచి రూ.3500 మీ అకౌంట్ల‌లో జ‌మ అయ్యే ఏర్పాటు చేస్తా. ఉచిత గ్యాస్ అందిస్తాం. ఆడ‌ప‌డుచుల‌కి ఆక‌తాయిల నుంచి మాన‌, ప్రాణాలకి భ‌ద్ర‌త క‌ల్పించేందుకు ప‌టిష్ట‌మైన చ‌ట్టాలు తీసుకువ‌స్తా. వైసీపీ నాయ‌కుడు బొత్స స‌త్య‌నారాయ‌ణ ఈ మ‌ధ్య జ‌న‌సేన పార్టీ టీడీపీతో కుమ్మ‌క్క‌య్యింద‌ని చెబుతున్నారంట‌. విజ‌య‌న‌గ‌రంలో ఆడ‌ప‌డుచులు త‌రిమికొట్టారు. మ‌ళ్లీ అలాంటి ప‌రిస్థితులు రాకుండా ఉండాలంటే పిచ్చి పిచ్చి మాట‌లు ఆపండి. మా కేడ‌ర్‌ని గంద‌ర‌గోళానికి గురి చేసే ప్ర‌య‌త్నాలు చేస్తే.. విజ‌య‌న‌గ‌రం వ‌చ్చి మీ సంగ‌తి తేలుస్తా అంటూ మండిపడ్డారు

మ‌రోసారి చెబుతున్నా.. జ‌న‌సేన పార్టీ వామ‌ప‌క్షాల‌తో మిన‌హా టీడీపీతో గానీ, వైసీపీతో గానీ పొత్తు పెట్టుకోవ‌డం లేదు. మీరు నా మీద పెట్టిన భ‌రోసా నిరూపించుకుంటా. ఒంట‌రిగానే బ‌రిలోకి దిగుతాం. మీరు ఇచ్చే బ‌లాన్ని బట్టి చ‌ట్ట స‌భ‌ల్లో పోరాటం చేస్తాం. చ‌ట్ట‌స‌భ‌ల‌కి వెళ్ల‌కుండానే పోరాటం చేస్తున్నాం. ఆదోనిలో గ‌వ‌ర్న‌మెంట్ కాలేజీ గురించి మాట్లాడితే వెంట‌నే శాంక్ష‌న్ అయ్యింది. అది మ‌న బ‌లం.  2019లో నేను సిఎం కాకుండా ఎవ్వ‌రు ఆపుతారో చూద్దాం. మ‌నం ప‌ల్ల‌కీలు మోసింది చాలు. ఇక మీద‌ట ఎవ‌రి ప‌ల్ల‌కీలు మోయాల్సిన అవ‌స‌రం లేదు. జ‌న‌సేన ప్ర‌భుత్వంలో స‌త్యాన్ని, ధ‌ర్మాన్ని ప‌ల్ల‌కీలు ఎక్కించి మోయిద్దాం అని అన్నారు.

ఇప్పుడే ఓ శుభ‌వార్త అందింది. పాకిస్థాన్ చెర‌లో చిక్కుకున్న ఎయిర్‌మార్ష‌ల్ అభినంద‌న్ గారిని పాకిస్థాన్ ప్ర‌భుత్వం విడుద‌ల చేస్తోంది. మ‌న ప్రార్థనలు ఫ‌లించాయ‌ని భావిస్తున్నాం. ఆయ‌న క్షేమంగా ఇంటికి చేరాల‌ని ప్రార్థన చేసిన ప్ర‌తి ఒక్క‌రికీ కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌చేస్తున్నాం. బోర్డ‌ర్‌లో శత్రు సేన‌ల నుంచి ఆ సైనికులు దేశాన్ని కాపాడుతుంటే, రాష్ట్రాన్ని అవినీతి నుంచి మ‌న జ‌న‌సైనికులు కాపాడుతున్నారు. ఎన్నిక‌ల సంఘం కామ‌న్ సింబ‌ల్ ఎంచుకోవాల‌న్న‌ప్పుడు ప‌దింటిలో మొద‌టిది గ్లాస్ థంబ్ల‌ర్ ఎంచుకున్నా. పంపిన ర‌క‌ర‌కాల సింబ‌ల్స్‌లో నాకు ఇష్ట‌మైన గ్లాస్ థంబ్ల‌ర్ కామ‌న్ సింబ‌ల్‌గా రావ‌డం ఆనందాన్నిచ్చింది. భ‌గ‌వంతుడి క‌రుణ‌తోనే ఇది మ‌న‌కి వ‌చ్చింది. గ్లాస్ సింబ‌ల్ మీద లైట్ వేస్తే ధ‌ర్మాన్ని నిల‌బెట్టే ధ‌ర్మ చ‌క్రం క‌న‌బ‌డుతుంది. గ్లాస్ సింబ‌ల్‌కి ఓటేస్తే జ‌న‌సేన పార్టీ అధికారంలోకి వ‌చ్చి ధ‌ర్మాన్ని కాపాడుతుంది. క‌డ‌ప జిల్లాలో ఇల్లు క‌ట్టుకోవాల‌ని కోరిక క‌లిగింది. దాశరథి గారు రైల్వే కోడూరులో మంచి స్థ‌లం చూసిపెడితే ఇల్లు క‌ట్టుకుంటాన‌ని తెలిపారు. అంత‌కు ముందు స‌భ మొద‌ల‌వ‌డానికి ముందు శ్రీ దాశరథి గారిని వేదిక మీద నుంచి ప‌రిచ‌యం చేశారు. ఎవ్వ‌రూ లేన‌ప్పుడు నా మీద న‌మ్మ‌కంతో రైల్వే కోడూరు నుంచి వ‌చ్చి నాకు అండ‌గా నిల‌బ‌డ్డార‌ని, ఇప్పుడు అదే న‌మ్మ‌కంతో రైల్వే కోడూరు సీటు కొట్టి చూపాల‌ని పిలుపుని”చ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *