జనసేన తరంగం కార్యక్రమంలో ఇంటింటి తలుపు తట్టిన జనసేనాని

ఎన్నికల కోసం.. ఓట్ల కోసం.. కాదు మీ బిడ్డల భవిష్యత్తు కోసం మీ ముందుకు వచ్చాం. మీ బిడ్డల భవిష్యత్తు కోసం జనసేన పార్టీ పనిచేస్తోంది. చాలా మంది కులాలని వాడుకుంటున్నారు. అన్ని కులాలని ఒక చోట చేర్చేందుకు మేం వ చ్చామని జనసేన అధ్య క్షుడు పవన్‌ కల్యాణ్‌ పేర్కొన్నారు. అనంతపురం జిల్లా శింగనమల నియోజకవర్గం పరిధిలోని మార్తాడు గ్రామంలో ‘జనసేన తరంగం’ కార్య క్రమాన్ని ఆ పార్టీ అధినేత పవన్‌కల్యాణ్‌ బుధవారం ఉదయం ప్రారంభించారు. జనసేన పార్టీ మేనిఫెస్టో విజన్‌, పార్టీ సిద్ధాంతాలను వివరించే కార్యక్రమం జనసేన తరంగం. రాష్ట్రవ్యాప్తంగా నేటి నుంచి అయిదు రోజులపాటు ఉధృతంగా నడుపుతామ న్నారు.

పవన్‌ కల్యాణ్‌ మార్తాడు గ్రామంలోని ఎస్సీ వ్యవసాయ కూలీ జీలకర్ర ముత్యాలప్ప ఇంటి తలుపు తట్టారు. 62 సంవత్సరాల వృద్ధుడు ముత్యా లప్ప కుటుంబ స భ్యులు జనసేనానికి సాధరంగా ఇంట్లోకి ఆహ్వనించారు. అనంతరం కుటుంబ వివ రాలు, వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ముత్యాలప్ప కుమారుడు సోమశేఖర్‌ జర్నలిజం చేసి నిరుద్యోగిగా ఉన్నట్లు చెప్పగా, ముత్యాలప్ప తాను వ్యవసాయ కూలీగా రోజుకి అర్ధ రూపాయి ఇచ్చే రోజుల నుంచీ పనిచేస్తున్నట్లు తెలిపారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు మా బతుకుల్లో ఎలాంటి మార్పు రాలేదని వివరించారు. తనకు 62 సంవత్సరాల వయసు వచ్చినా పింఛన్‌ రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

జనసేన తరంగం కార్యక్రమంలో భాగంగా పవన్‌ పార్టీ సిద్ధాంతాలను వారికి వివరించారు. కాన్షీరాం ఆలోచనలు, అంబే ద్కర్‌ ఆశయాలు నాలో ఉన్నాయి. ఇంత కష్టపడు తున్న మిమ్మల్ని ప్రభుత్వాలు బాగా చూసుకోవాలి. 62 ఏళ్ల వయస్సులో కూడా ఇంకా కష్టపడాల్సివస్తోంది. ఇంకా ఎంతకాలం కష్టపడాలి. ఈ వ్యవస్థ మారాలి. దివ్యాంగులకి ఐదు నుంచి రూ. 10వేల పెన్షన్‌ ఇస్తాం. వయసు మళ్లిన వారి కోసం ఓల్డ్‌ఏజ్‌ హోమ్స్‌ ఏర్పాటు చేస్తాం. ప్రభుత్వాలు ఇచ్చే బియ్యం బాగుండడం లేదు. అందుకే రేషన్‌కు బదులుగా మహిళల ఖాతాలకి నేరుగా డబ్బు జమ చేయాలని నిర్ణయించాం. ఒక్క రోజులో వ్యవస్థని మార్చలేం. పార్టీలో ఉన్న పెద్దలతో కలసి మార్పు తీసుకువద్దాం. ఓ వైపు కులాలు ఉండకూడదని చెబుతారు. మరో వైపు ఎస్సీ హాస్టల్స్‌, బీసీ హాస్టల్స్‌ అంటూ విడగొడతారు. కులాలు లేనప్పుడు అన్నీ కలసే ఉండాలని అన్నారు. జనసేన పార్టీ సిద్ధాంతాలు వారికి నచ్చడంతో ముత్యాలప్ప కుటుంబ సభ్యులతో పవన్‌ మిస్డ్‌కాల్‌ ఇప్పించారు.

ఫేస్‌బుక్‌ లైవ్‌ ద్వారా జనసేన తరంగం కార్యక్రమాన్ని ప్రారంభించిన విషయాన్ని పవన్‌ కల్యాణ్‌ జనసేన పార్టీ శ్రేణులతో పంచుకున్నారు. జనసైనికులు అంతా ఈ కార్యక్రమాన్ని చేయండి. ప్రతి ఇంటి తలుపు తట్టండి. పార్టీ సిద్ధాంతాలు వివరించండి. మహిళలకి ఏం చేస్తామో చెప్పండి. జనసేన తరంగం కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్లిండి, అంటూ పిలుపునిచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *