ఎంత కాలం బెదిరిస్తారు? : పవన్‌

అనంతపురం జిల్లా శింగనమల నియోజకవర్గం పరిధిలోని మార్తాడు గ్రామంలో ‘జనసేన తరంగం’ కార్య క్రమాన్ని ఆ పార్టీ అధినేత పవన్‌కల్యాణ్‌ బుధవారం ఉదయం ప్రారంభించారు. జనసేన పార్టీ మేనిఫెస్టో విజన్‌, పార్టీ సిద్ధాంతాలను వివరించే కార్యక్రమం జనసేన తరంగం. పవన్‌ కల్యాణ్‌ మార్తాడు గ్రామంలోని పవన్‌ కల్యాణ్‌ దీ వి కృష్ణమూర్తి ఇంటి తలుపుతట్టారు. కుటుంబ సభ్యుల వివరాలు తెలుసుకుని, అందర్నీ పేరు పేరునా పలకరించారు. ఎవరెవరు ఏం పనిచేస్తున్నారంటూ ఆరా తీశారు.

నాలుగు సంవత్సరాల క్రితం ఇంటికి దరఖాస్తు చేసుకోగా, ఇప్పటికి ఇల్లు మంజూరు చేయలేదన్న విషయాన్ని పవన్‌ కల్యాణ్‌కు కృష్ణమూర్తి తెలిపారు. తాను జనసేన జెOడా పట్టానని వేధిస్తున్నారని ఫిర్యాదు చేశారు. పవన్‌ కల్యాణ్‌ మాట్లాడుతూ ఎంతకాలం బెదిరిస్తారు. ఈ పాలకులు అభివృద్ధి చేయరు.. .. వ్యవస్థని నిర్వీర్యం చేస్తారు. ఇలాంటి పరిస్థితి ఎక్కడో ఒక చోట మారాలి. ఈ వ్యవస్థలో సంపద మొత్తం కొద్ది మందికే వెళ్లిపోతోంది. అభివృద్ధి ఫలాలు అందరికీ అందాలి. నేను ఓట్లు వేయించుకోవడానికి రాలేదు. మార్పు తేవడానికి వచ్చా. 25 సంవత్సరాలపాటు మీ కోసం పని చేయడానికి వచ్చా. సమస్యలు అర్ధం చేసుకున్నా.. కులాలు, ప్రాంతాలని అర్ధం చేసుకున్నా.. కులాలనీ, ప్రాంతాలనీ కలసే విధానం రావాలి. ప్రస్తుతం గ్యాస్‌ సిలిండర్‌ ధర భారం మీ మీద పడరాదన్న ఉద్దేశంతో ఉచిత గ్యాస్‌ పథకాన్ని జనసేన మేనిస్టోలో పేర్కొన్నాం. మనకి కావాల్సినంత గ్యాస్‌ ఉంది. అదంతా మన కోసం వినియోగిస్తా. ప్రభుత్వం ఇచ్చే బియ్యం తినే పరిస్థితి లేదు. ఆ డబ్బు నేరుగా మీ ఖాతాలకే వేస్తే, మీకు కావల్సినవి ఏవో మీరే కొనుక్కుంటారు అన్నారు. జనసేన పార్టీ మేనిస్టోని సిద్ధాంతాలని ఆ కుటుంబానికి వివరించారు. వారితో మిస్డ్‌కాల్‌ ఇప్పించారు.

అనంతరం మార్తాడు గ్రామంలో ముస్లిం సోదరుడు హాసన్‌ ఇంటి తలుపుని జనసేన నేత నాదెండ్ల మనోహర్‌, మాజీ మంత్రి రావెల కిషోర్‌ బాబులు కలసి తలుపు తట్టారు. ఆ కుటుంబ సభ్యుల వివరాలు అడిగి తెలసుకుని, వారికి పార్టీ సిద్ధాంతాలు వివరించారు. విలువలతో కూడిన రాజకీయాలు చేయడానికి పవన్‌ కల్యాణ్‌ పార్టీ పెట్టారన్నారు. ఆ సిద్ధాంతాలకి కట్టుబడి ఉంటామన్నారు. ఓట్ల కోసం రాజకీయాలు చేయడం లేదు. సమాజంలో మార్పు కోసమే పనిచేస్తున్నట్లు తెలిపారు. హాసన్‌ కుటుంబ సభ్యులతో మిస్డ్‌కాల్‌ ఇప్పించి పార్టీ సభ్యత్వం ఇచ్చారు. అనంతరం పవన్‌కల్యాణ్‌ హాసన్‌ కుటుంబ సభ్యులని పలకరించి, వారి కష్టాలు అడిగి తెలుసుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *