జనసేనలో చేరిన మాజీ మంత్రి రావెల

విజయవాడ: ఏపీ మాజీ మంత్రి, ప్రత్తిపాడు ఎమ్మెల్యే రావెల కిశోర్‌బాబు జనసేన పార్టీలో చేరారు. పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ సమక్షంలో జనసేన కండువా కప్పుకొన్నారు. ఈ సందర్భంగా పవన్‌ మాట్లాడుతూ.. దళితులకు రావెల ఎంతో సేవ చేశారన్నారు. 2014లోనే ఆయన ఆలోచనలు, ఆదర్శాలను గుర్తించానని అన్నారు. అవకాశవాద, కుల రాజకీయాలకు జనసేన వ్యతిరేకమని పేర్కొన్నారు.

విజయవాడ అనగానే కుల రాజకీయాలు గుర్తొస్తాయని, వాటి వల్ల అభివృద్ధి దెబ్బతింటుందన్నారు. ఆంధ్ర- తెలంగాణ గొడవల్లో ఇప్పటికే చాలా నలిగిపోయామన్నారు. ఇవాళ ఎక్కడికి వెళ్లినా అవినీతి, వెన్నుపోట్లే కనిపిస్తున్నాయని, ఇసుక మాఫియా, మహిళలపై దాడులు చూసి విసిగిపోయానని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో 2050 విజన్‌ ఎలా సాధ్యమని ప్రశ్నించారు. కుల రాజకీయాలు ఉండవనే ఉద్దేశంతోనే ఆనాడు తెదేపాకు మద్దతిచ్చానని పవన్ కళ్యాణ్ తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *