చంద్రబాబు, లోకేష్ లకు ఆత్మాభిమానం ఏది : పవన్

ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు, ఆయన కుమారుడు మంత్రి లోకేష్ లకు ఆత్మాభిమానం లేదని జనసేన అదినేత పవన్ కళ్యాణ్ అమలాపురంలో జరిగిన సభలో విమర్శించారు. రాష్ట్రం నుంచి చమురు నిక్షేపాలను దోచుకెళ్తున్న వారిని చంద్రబాబు ఎందుకు నిలదీయడం లేదని ప్రశ్నించారు. ఆయిల్‌ దోపీడీని ప్రశ్నిస్తే బాబు కేసులను కేంద్రం బయటకు తీస్తుందని భయపడుతున్నారని చెప్పారు. తెలుగు ప్రజలకు, తెలుగు రాష్ట్రానికి తీరని అన్యాయం జరుగుతున్నా ప్రశ్నించకుండా ఆత్మాభిమానం లేకుండా చంద్రబాబు, లోకేశ్‌లు బతుకుతున్నారని మండిపడ్డారు. ప్రతిపక్ష నేత జగన్‌కు కూడా మోదీ భయం పట్టుకుందన్నారు. రాష్ట్రాన్ని ఇష్టానుసారంగా దోచుకుంటున్న వీళ్లను తెలుగు ప్రజలు స్ఫూర్తిగా తీసుకుని ఆదరించాలా? అని ప్రశ్నించారు. ప్రస్తుతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరు చూస్తుంటే భవిష్యత్తులో ప్రత్యేక దక్షిణ భారతదేశం అనే నినాదం తెరపైకి వస్తుందని ఆయన హెచ్చరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *