అమలాపురం, రాజమండ్రి లోక్ సభ స్థానాల నుంచి పోటీ చేసే జనసేన అభ్యర్థులు వీరే..

అమలాపురం, రాజమండ్రి లోక్ సభ స్థానాల నుంచి పోటీ చేసే జనసేన అభ్యర్థులను జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కల్యాణ్ గారు ప్రకటించారు. పార్టీ నుంచి పార్ల‌మెంట్ కు పోటీ చేసే తొలి అభ్య‌ర్ధిగా అమ‌లాపురం స్థానానికి శ్రీ డి.ఎం.ఆర్ శేఖ‌ర్ గారు, రెండో అభ్య‌ర్ధిగా రాజ‌మండ్రి పార్ల‌మెంట్ స్థానం నుంచి డాక్ట‌ర్. ఆకుల స‌త్య‌నారాయ‌ణ గారు పేర్ల‌ను ప్ర‌క‌టించారు. వారికి పార్టీ అండ‌గా ఉంటుంద‌ని, ఇద్ద‌రి గెలుపునకు ఎంత కృషి చేయాలో అంత చేస్తామ‌న్నారు.

విజ‌య‌వాడ‌లోని పార్టీ రాష్ట్ర కార్యాల‌యంలో శ్రీ డి.ఎం.ఆర్. శేఖ‌ర్ గారితో పాటు అనేక మంది నేత‌లు పార్టీలో చేరారు. వీరంద‌రికి శ్రీ ప‌వ‌న్ క‌ళ్యాణ్ గారు కండువాలు క‌ప్పి సాద‌రంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సంద‌ర్భంగా శ్రీ ప‌వన్ క‌ళ్యాణ్ గారు మాట్లాడుతూ.. “ఓఎన్జీసీలో ఉన్నతాధికారిగా బాధ్యతలు నిర్వర్తించిన డి.ఎం.ఆర్ శేఖ‌ర్ గారు పార్టీలో చేర‌డం చాలా ఆనందాన్ని ఇచ్చింది.  2014 పార్టీ ఆవిర్భావ స‌భ‌కు మిత్రుల‌తో క‌లిసి వ‌చ్చి మ‌ద్ద‌తు తెలిపారు. శేఖ‌ర్ గారితో గ‌త ఏడాదిగా మాట్లాడుతున్నాను. బ‌డుగు, బ‌ల‌హీన‌వ‌ర్గాల‌కు మేలు చేయాల‌న్న ఆయ‌న‌ త‌ప‌న న‌న్ను క‌దిలించింది. ఆయ‌న ఇప్పుడు పార్టీలో చేర‌డం కేవ‌లం ఫార్మాలిటి.  జ‌న‌సేన పార్టీ స్థాపించిన‌ప్పుడే మా మ‌న‌సులు క‌లిశాయి. జ‌న‌సేన పార్టీలోకి వ‌స్తే గుండెల్లో పెట్టుకుని చూసుకుంటాం అని నేను చెప్పిన మాట న‌మ్మి పార్టీలోకి వ‌చ్చినందుకు ధ‌న్య‌వాదాలు. మీలాంటి ఉన్న‌త మ‌న‌స్త‌త్వం క‌లిగిన‌వారు, బ‌డుగు, బ‌ల‌హీన వ‌ర్గాల‌కు అండ‌గా ఉండాల‌నుకునే వారు జ‌న‌సేన పార్టీలో చేర‌డం పార్టీకి మ‌రింత బ‌లాన్ని చేకూర్చుతుంది. 

అలాగే డాక్ట‌ర్.ఆకుల స‌త్య‌నారాయ‌ణ‌గారి కుటుంబంతో ప్ర‌త్యేక అనుబంధం ఉంది. మా కుటుంబానికి ఎంతో స‌న్నిహితులు. ఉద్ధానం స‌మ‌స్య ప‌రిష్కారం కోసం శ్రీకాకుళంలో నిరాహార దీక్ష చేస్తే నాతో పాటు వాళ్ల కుటుంబం కూడా దీక్ష‌కు కూర్చుంది. 2014 ఎన్నిక‌ల్లో బెజెపి త‌రుపున పోటీ చేసి రాజ‌మండ్రి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేసి జ‌న‌సేన పార్టీలో జాయిన్ అయిన‌ప్ప‌టి నుంచి అనేక‌మందిని పార్టీలో జాయిన్ చేస్తూ పార్టీ బ‌లోపేతానికి కృషి చేస్తున్నారు.  ఆయ‌న చేసిన కృషికి ధ‌న్య‌వాదాల‌”న్నారు. తాడేప‌ల్లి గూడెం మున్సిప‌ల్ ఛైర్మ‌న్ శ్రీ బొల్లిశెట్టి శ్రీనివాస్ గారు జనసేన పార్టీలో చేరారు. శ్రీనివాస్ టీడీపీ నుంచి మునిసిపల్ చైర్మన్ గా ఎన్నికయ్యారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *