నేడు ‘తరంగం’ కార్యక్రమానికి శ్రీకారం… కార్యకర్తలకు పవన్‌ కల్యాణ్‌ పిలుపు

ప్రతి ఇంటి తలుపు తట్టి..జనసేన పార్టీ మేనిఫెస్టో, సిద్ధాంతాలను ప్రజలకు వివరించాలని జనసేన పార్టీ అధినేత పవన్‌కల్యాణ్‌ జన సైనికులకు పిలుపునిచ్చారు. జనసేన పార్టీ మేనిఫెస్టో అంశాలు, సిద్ధాంతాలు, ఆశయాలను ప్రజలకు తెలియజెప్పేందుకు జనసేన తరంగం కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు పవన్‌ కళ్యాణ్‌ తెలిపారు. బుధవారం ఉదయం 11 గంటలకు ఈ కార్యక్రమం మొదలవుతుందని, అనంతపురం జిల్లా శింగనమల నియోజకవర్గంలోని ఒక గ్రామంలో మొదలయ్యే ఈ కార్యక్రమంలో తాను పాల్గొంటున్నట్లు తెలియజేశారు. మంగళవారం ఉదయం అనంతపురం నుండి పేస్‌బుక్‌ లైవ్‌ ద్వారా ఇందుకు సంబంధించిన వివరాలను జన సైనికులతో పంచుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 5వ తేది నుండి 5 రోజుల పాటు ఈ కార్యక్రమం నిర్వహించనున్నామన్నారు. పార్టీ సిద్ధాంతాలను, మేనిఫెస్టోలోని అంశాలను ప్రజలకు తెలియజెప్పే ఉద్దేశంతో జనసేన తరంగం కార్యక్రమం చేపట్టామని, ప్రతి యువకుడు, యువతి, పెద్దలు పాల్గొని, కులాలకు, మతాలకు అతీతంగా రేపటి త రం కోసం జనసేన చేస్తున్న నవతరం రాజకీయాలను తెలియజెప్పాలన్నారు.

జనసేన తరంగం కార్యక్రమం వివరాలు..
జన సైనికులు తమ గ్రామంలోని ప్రతి ఇంటికి వె ళ్లి ఆ ఇంట్లోని వారికి జనసేన సిద్ధాంతాలను, మేనిఫెస్టో విజన్‌ డాక్యుమెంట్‌ లో పొందుపరచిన అంశాలను వివరించి, కరపత్రాన్ని అందజేస్తారు. ఆ ఇంటికి వెళ్లిన జన సైనికులలో ఒకరు కార్యక్రమం కొరకు నియమించిన హ్యాష్‌టాగ్‌తో ఫేస్‌ బుక్‌ లౖౖెవ్‌ తీసుకుంటారని , సిద్దాంతాలను, మేనిపెస్టో విజన్‌ డాక్యుమెంట్‌ అంశాలను తెలిపిన అనంతరం ప్రజల అనుమతితో వారి ఫోన్‌ నెంబర్‌ నుండి 9010101170 నెంబర్‌కు మిస్ట్‌ కాల్‌ ఇస్తారు. ఈ నెల 5వ తేది ఉదయం 11 గంటల నుండి 9వ తేది వరకు జనసేన తరంగం కార్యక్రమం చేపట్టనున్నట్లు జనసేన అద్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌ తెలిపారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *