సామాజిక న్యాయమేదో చూపిస్తా… మార్పు నాతోనే ఆరంభం : పవన్‌

2019ఎన్నికల తర్వాత ప్రభుత్వం జనసేనదేనని ఆ పార్టీ అధినేత పవన్‌కళ్యాణ్‌ ఘంటాపథంగా ప్ర కటించారు. 2019ఎన్నికల్లో జగన్‌ ప్రభుత్వాన్ని స్థాపించలేరు. తెలుగుదేశానికి రోజులు మూడాయి. జనసేన ఒక్కటే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలదు. ఆ మాట కొస్తే 2014లో కూడా జనసేన అండలేకుండా తెలుగు దేశం గెలిచుండేదికాదంటూ పేర్కొన్నారు. 2009లో ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాం. దెబ్బలు తిన్నాం.. అవమానాలు, ఛీత్కారాలకు గురయ్యాం.. అప్పుడు తిట్టిన ప్రతి ఒక్కరికి 2019లో తగిన జవాబు చెబుతాం.. వెన్నుచూపే తత్వం మాకులేదు.. రొమ్ము విరిచి ధైర్యంగా ముందుకురుకుతాం అంటూ ఆయన ప్రకటించారు. ఇంకా పౌరుషం, ఆత్మాభిమానం బ్రతికే ఉన్నాయి. అప్పట్లో వెటకారం చేసిన వారందరికీ తగిన గుణపాఠం తప్పదు. నన్ను వెక్కిరించారు. సామాజిక న్యాయమంటే వెకిలిగా చూశారు. కులాల ఐక్యతంటే విమర్శలు గుప్పించారు. అలాంటివా రందరికీ వచ్చే ఎన్నికల్లో సరైన సమాదానం చెబుతానంటూ పవన్‌ పేర్కొన్నారు. తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలో గురువారం భారీ బహిరంగ సభనుద్దేశించి పవన్‌ మాట్లాడారు.

రాహువు పట్టిన పట్టు ఒక్క సెకండు అఖండమైన లోకభాంధవుడు అసలే లేకుండా పోతాడా?
మూర్కుడు గడియారంలో ముల్లుని కదలనీయకుంటే ధరాగమనం అంతటితో తలకిందులైపోతుందా?
ధనుజులోకమేకంగా దారికి అడ్డంగా నిల్చుంటే నరజాతి ప్రస్థానం పరిసమాప్తమవుతుందా?
కుటిలాత్మక కూటమికొక్క తృటికాలపు జయమొస్తే విశ్వసృష్టి విచ్ఛిన్నం అవుతుందా ?
అంటూ ఆయన గుంటూరు శేషేంద్రశర్మ రచించిన ఆధునిక మహాభారతం గ్రంథంలోని అంశాల్ని ప్రస్తావించారు. వచ్చే ఎన్నికల్లో జనసేన ప్రభుత్వం ఏర్పడకుండా ఎవరూ ఆపలేరన్నారు. మార్చిలోనే ఎన్నికలొస్తాయి. జనసైనికులంతా ఏకమై కష్టపడండని సూచించారు. భయపెడదామని ఇప్పటికే ఎందరో ప్రయత్నాలు చేశారు. కానీ తనకు భయపడే నైజంలేదన్నారు. ఒక్కడినైనా ప్రయాణిస్తానుగాని వెనుకంజేసే ప్రసక్తే లేదన్నారు. ఏ మార్పైనా ఒక్కిడితోనే మొదలౌతుందని పవన్‌ చెప్పారు. ధవళేశ్వరం కవాతు కూడా ఒక్కిడితోనే మొదలైంది. పదిలక్షల మందికి చేరింది. రాష్ట్రంలో కోట్లాదిమంది మార్పు కోరుకుంటున్నారు. వీరందరికీ 2019చాలా కీలకం. రానున్న పదేళ్ళు రాష్ట్రంలో పెను మార్పులొస్తాయి. ఓటు అనే ఆయుధాన్ని బలంగా వినియోగించండి.. జనసేనను గెలిపించండంటూ ఆయన పిలుపునిచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *