యుద్ధ శంఖారావం పార్టీ ప్రచారానికి శ్రీకారం

అమరావతి: జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ సిద్దమవుతున్నారు. అయితే గురువారం (రేపు)రాజమహేంద్రవరంలో పార్టీ ఆవిర్భావ సభతో ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు. కాగా ఈ సభకు యుద్ధ శంఖారావం అని పేరు పెట్టారు. రాజమహేంద్రవరం సభ తరువాత ప్రచారం వేగవంతం చేసే ఆలోచనలో పవన్‌ ఉన్నాడు. ఈ విషయంపై పార్టీ నాయకులకూ స్పష్టత ఇచ్చి, ప్రచార ప్రణాళికలను సిద్ధం చేయాలని సూచించారు. రోజుకు 3 చోట్ల ఎన్నికల సభలకు ఏర్పాట్లు చేయాలని పవన్‌ పేర్కొన్నారని సమాచారం. హెలికాప్టర్‌ సాయంతో రాష్ట్రమంతటా చుట్టి రావాలనే యోచనలో ఆయన ఉన్నారు.

దీంతోపాటు రోడ్డు షోలలోనూ ఆయన పాల్గొంటారు. మరోవైపు కమ్యూనిస్టు పార్టీలతో పొత్తులను కొలిక్కి తీసుకురావడం, పార్టీ అభ్యర్థుల జాబితాను సిద్ధం చేయడం వంటి వాటిపై పార్టీ నాయకులు దృష్టి సారించారు. వామపక్షాలు కోరిన స్థానాలను యథాతథంగా కేటాయించేందుకు పార్టీ సానుకూలంగా లేదని సమాచారం. జనసేనకు బలం ఉన్న స్థానాలనే వామపక్షాలు ప్రతిపాదిస్తుండటంతో ఈ విషయంపై పార్టీ అధినేత భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసినట్లు తెలిసింది. మంగళవారం పవన్‌ కల్యాణ్‌తో వామపక్ష పార్టీల చర్చలు సాగుతాయని భావించినా అనుకోకుండా రద్దయ్యాయి. 16న సమావేశమవుదామని జనసేన కార్యాలయం నుంచి వామపక్ష నాయకులకు వర్తమానం అందింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *