రోడ్డుప్రమాద మృతుల కుటుంబాలకు రూ.2లక్షల చొప్పున పవన్ సాయం

అనంతపురంలో జనసేన పార్టీ నిర్వహించిన కార్యక్రమానికి హాజరై వెళ్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు జనసేన కార్యకర్తలు మరణించారు. కర్నూలు జిల్లా డోన్ వద్ద జనసేన కార్యకర్తలు వెళ్తున్న కారును ఎదురుగా వస్తున్న వోల్వో బస్సు ఢీకొనడంతో కారులో ప్రయాణిస్తున్న నలుగురు కార్యకర్తలు అక్కడికక్కడే మరణించారు.

రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన నలుగురు జనసైనికుల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున ఆర్థికసాయం అందిస్తామని పవన్‌ ప్రకటించారు. అంత్యక్రియల ఖర్చులు కూడా తామే భరిస్తామన్నారు. ‘ఆ కుటుంబాలకు అండగా ఉంటాం. జనసైనికుల మృతి బాధాకరం. నూరేళ్లు జీవించాల్సిన వారు దురదృష్టవశాత్తూ మృతిచెందడం బాధ కలిగించిందని పవన్ తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *