ప్రయోగాలకు సిద్ధంగా లేను… గెలిచేవారికే సీట్లిస్తా : పవన్‌

గెలిచే వారికే సీట్లిస్తాం తప్ప ప్రయోగాలకు తాము సిద్దంగా లేమని జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ తేల్చిచెప్పారు.గెల్చి చట్టసభల్లో కూర్చుం టేనే తాను ప్రజలకండగా నిలబడగలనన్నారు. పేరు కోసం కులాల వారీగా ఇన్నేసి సీట్లు కేటాయి స్తానని హామీ ఇవ్వలేనన్నారు. అలా పేరు కోసం ప్రాకులాడితే అవినీతిని అంతం చేయడం సాధ్యం కాదన్నారు. 2009లో ఆశయాలు, సామాజిక న్యాయం పేరిట దెబ్బతిన్న విషయాన్ని పవన్‌ గుర్తు చేశారు. చట్టసభల్లో ఎవరికెన్ని సీట్లు ఇస్తా మన్నదానికంటే ప్రజలకు అండగా నిలబడ్డమే తనకు ముఖ్యంగా ఆయన పేర్కొన్నారు. గురు వారం తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలో చేనేత కార్మికుల్తో ఆయన ప్రత్యేకంగా సమావేశ మయ్యారు. ఈ సందర్భంగా చేనేతలు తమ సమ స్యల్ని పవన్‌కు వివరించారు.

దీర్ఘకాల అపరిష్కృత సమస్యల పరష్కారానికి తమ కులస్తులకు జిల్లాకు రెండేసి చొప్పున అసెంబ్లి సీట్లు కేటాయిం చాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై స్పందించిన పవన్‌ పై విధంగా బదులిచ్చారు. రెండేసి సీట్లు ఇచ్చినంత మాత్రాన చేనేతలకు న్యాయం జరగదన్నారు. సీట్లిస్తే కుల నాయకులు చట్టసభలకెళ్ళి బాగు పడతారు తప్ప కులాలు, కుల వృత్తులు బాగుపడ వన్నారు. చేనేత అన్నది పలు కులాల సమ్మేళనం గా పేర్కొన్నారు. లేసుల అల్లిక నుంచి చేనేతకు సంబంధించి చేసే ప్రతి ఒక్కరి కష్టాలు తనకు తెలుసన్నారు. మగ్గాలపై నేసే చీరలకు మంచి ధరలు రావాలన్నారు. చిన్న అగ్గిపెట్టెలో పట్టుచీరను అమర్చిన నైపుణ్యం రాష్ట్ర చేనేతలదని ప్రశంసించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *