ధర్మ పోరాట దీక్ష అని వందల కోట్లు ఖర్చు పెడతారు కానీ చేనేత కార్మికుల చావులు ఆపలేరా?: పవన్‌

అనంతపురం జిల్లా ధర్మవరం మండలం గొట్లూరులో చేనేత కార్మికులతో నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో పవన్‌ మాట్లాడారు. ధర్మ పోరాట దీక్ష అని వందల కోట్లు ఖర్చు పెడతారు కానీ చేనేత కార్మికుల చావులు ఆపలేరా? అని జనసేన పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ ప్రశ్నించారు.  మగ్గం నేయడం రాని వారు కోట్లు సంపాదించుకుంటుంటే చేనేత కార్మికులు పస్తులతో చనిపోతుండటం బాధాకరమన్నారు. చేనేత కార్మికులు చనిపోయాక భిక్షాటన చేయటం కాదు… చేనేత కార్మికులు చనిపోకుండా చర్యలు తీసుకోవాలన్నారు. జీఎస్టీ మీద ఎవరూ మాట్లాడటం లేదన్నారు. ప్రజల వైపు బలంగా నిలబడే గుండె ధైర్యం అధికార, ప్రతిపక్షాలకు లేదన్నారు. చేనేత కళాకారులకు తాను అండగా ఉంటానన్నారు. చేనేత కలను నేర్చుకోవాలనుకుంటున్న యువతకు స్టైఫండ్‌ ఇచ్చి శిక్షణా కేంద్రాలను ధర్మవరం నుంచే ప్రారంభిస్తామన్నారు. రాష్ట్ర స్థాయిలో ఉత్తమ చేనేత కార్మికులకు గుర్తింపునిస్తామని పేర్కొన్నారు. జనసేన ప్రభుత్వం వచ్చాక కామన్‌ హాస్టల్స్‌ పెడతామన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *