టీడీపీలో వికెట్ డౌన్… జనసేన పార్టీలో చేరిన రావెల కిశోర్ బాబు

విద్యా వేత్త మేధావి మాజీ ఉపాధ్యాయులు అధికార పార్టీ మినిస్టర్ రావెల కిశోర్ బాబు గారు MA ,M PHIL ,రాజకీయ నాయకులుగా, మాజీ ప్రభుత్వ అధికారిగా మరియు అధ్యక్షులుగా ప్రజలకు ఎంతో సేవలను అందించారు

తాడికొండ మండలం రావెలలో 1959 మార్చి 11న జన్మించిన కిషోర్‌బాబు గారు 1973లో అమరావతి ఎస్‌ఆర్‌కె ఉన్నత పాఠశాలలో ప్రాథమిక విద్యాభ్యాసాన్ని పూర్తిచేసారు. గుంటూరు ఏసి కళాశాలలో ఇంటర్, అమరావతి ఆర్‌వివిఎస్ కళాశాలలో డిగ్రీ, ఆంధ్రా యూనివర్సిటీలో ఎంఎ, నాగార్జున విశ్వవిద్యాలయంలో ఎంఫిల్ చేశారు. తొలుత ప్రకాశం జిల్లా ఒంగోలులోని ఎబిఎం డిగ్రీ కళాశాలలో ఆర్థికశాఖ అధ్యాపకుడిగా చేరిన ఆయన అనంతరం ఎస్‌బిఐలో ప్రొబెషనరీ అధికారిగా గుజరాత్‌లో పనిచేసారు. 1987లో సివిల్స్ రాసి ఐఆర్‌టిఎస్‌కు ఎంపికయ్యారు. 1989లో దక్షిణ మధ్య రైల్వేలో ఉన్నతోద్యోగం పొంది వివిధ శాఖల్లో సీనియర్ లెవెల్ అధికారిగా విధులు నిర్వహించారు. 2000-2002 మధ్య ఢిల్లీలో దివంగత లోక్‌సభ స్పీకర్ జి.ఎం.సి.బాలయోగి వద్ద ఆంతరంగిక కార్యదర్శిగా పనిచేసారు. తర్వాత 2004 వరకు బి. ఆర్ అంబేద్కర్ ఫౌండేషన్ జాతీయ డైరెక్టర్‌గా, తరువాత దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాద్ డెప్యూటీ కమర్షియల్ మేనేజర్‌గా బాధ్యతలు నిర్వహించారు. 2009 నుంచి 2012 వరకు కులీకుతుబ్‌షా అర్బన్ డెవలప్‌మెంట్ అధారిటీ సికింద్రాబాద్‌లో అడ్మినిస్ట్రేటర్‌గా పనిచేసారు. వివిధ ప్రభుత్వ శాఖల్లో అధికారిగా బాధ్యతలు నిర్వహించిన కిషోర్‌బాబు 2014 ఏప్రిల్ 15న తన ఉద్యోగానికి రాజీనామా చేసి సార్వత్రిక ఎన్నికల్లో ప్రత్తిపాడు నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా వైసిపి అభ్యర్థిని మేకతోటి సుచరితపై విజయం సాధించారు.

ఇంతటి గొప్ప వ్యక్తి ఈ రోజు టీడీపీ గూటికి గుడ్ బై చెప్పి జనసేన సైన్యంలో ప్రజా సేవకై అధికారాన్ని సైతం వదులుకొని జనసేన పార్టీలో చేరడం మాకు అంతో ఆనందంగా ఉంది !

ఈ రోజు విజయవాడ పవన్ కళ్యాణ్ గారి గృహంలో సమావేశానికి హాజరై రేపు పార్టీ ఆఫీస్ నందు జనసేన పార్టీలో అధికారికంగా చేరుతున్న సందర్భంగా వారికి జనసేన సైనికుల తరుపున శుభాకాంక్షలు తెలియజేస్తూ
జై జనసేన జై హింద్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *