జనసేనలోకి ఎంట్రీ ఇవ్వబోతున్న టిడిపి ఎమ్మెల్యే కిషోర్ బాబు

ఆంద్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ నుంచి తొలి వికెట్ పడబోతుందని వార్త వచ్చింది. మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు త్వరలోనే టిడిపికి రాజీనామా చేసి జనసేన పార్టీలో చేరతారని మీడియాలో కదనం వచ్చింది. డిసెంబర్ 1న విజయవాడలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ సమక్షంలో రావెల పార్టీలో చేరనున్నారు. జనసేనలో చేరికపై పవన్ కల్యాణ్‌‌తో రెండు దఫాలుగా రావెల సమావేశం అయ్యారు.టిడిపి తనను పట్టించుకోవట్లేదని రావెల అసంతృప్తితో ఉన్నారు.

రావెల పార్టీ మారుతున్నట్లు తెలుసుకున్న టీడీపీ అధిష్టానం బుజ్జగించడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం నుంచి ప్రాతినిద్యం వహిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *