టిడిపి ఎన్నికల ప్రచారం మొదలు…

అమరావతి: ఈ నెల 16 నుంచి టిడిపి తన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనుంది. ఈ విషయమై చంద్రబాబు నాయుడు బుధవారం టిడిపి నేతలతో టెలీ కాన్ఫరెన్స్‌ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆ రోజే శ్రీకాకుళంలో, మరియు 17న గోదావరి జిల్లా, విశాఖ, విజయనగరంలో పర్యటించనున్నట్లు తెలిపారు. రెండో దశలో నెల్లూరు జిల్లా, ప్రకాశం, గుంటూరు, కృష్ణ.. తదుపరి వెంటనే కడప, కర్నూల్‌, అనంతపురంలో పర్యటిస్తామని పేర్కొన్నారు. 15 నుంచి బూత్‌ కన్వీనర్లు, సేవామిత్రులతో జిల్లా సభలు ఏర్పాటు చేయాలంటూ, సంక్షేమ పథకాల లబ్దిదారులందరూ టిడిపికి మద్దతు ఇచ్చేలా చూడాలని పార్టీ నేతలకు సూచించారు. గతంలో ఎన్నడూ లేనంత జాగ్రత్తగా పార్టీ అభ్యర్థులను ఎంపిక చేస్తున్నామని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *