తెలుగుదేశం పార్టీ రేపు 135 అభ్య‌ర్ధుల‌ జాబితా విడుద‌ల

తెలుగుదేశం పార్టీ తొలి జాబితా రేపు విడుద‌ల కానుంది..ఇప్ప‌టికే అభ్య‌ర్ధులు ఎంపిక‌ను వ‌డ‌పోత‌ను పూర్తి చేసిన చంద్ర‌బాబు నాయుడు 175 స్థానాల‌కు గాను 135 సీట్ల‌కు అభ్య‌ర్ధుల‌ను ఖ‌రారు చేసిన‌ట్లు సమాచారం..ఈ జాబితాపై స‌మీక్ష నిర్వ‌హించేందుకు అమ‌రావ‌తిలో రేపు టిడిపి పొలిట్ బ్యూరో సమావేశం ఏర్పాటు చేశారు.. ఈ మేర‌కు పొలిట్ బ్యూరో స‌భ్యుల‌కు స‌మాచారం ఇచ్చి మీటింగ్ కు రావ‌ల్సిందిగా కోరారు.. ఈ జాబితాను ప్ర‌క‌టించిన అనంత‌రం చంద్ర‌బాబు ఢిల్లీలో వెళ్ల‌నున్నారు.. తిరిగి ఆయ‌న 15వ తేది రాత్రికి అమ‌రావ‌తికి చేరుకుంటారు.. అక్క‌డి నుంచి 16వ తేది ఉద‌యానికి తిరుమ‌ల‌కు చేరుకుని శ్రీ‌వారి ద‌ర్శించుకుంటారు.. అనంత‌రం తిరుప‌తిలో సేవామిత్ర‌, బూత్ క‌మిటీ స‌భ్యుల‌తో సమావేశ‌మ‌వుతారు.. అక్క‌డి నుంచి బ‌య‌లుదేరి శ్రీ‌కాకుళం వెళ్లి టిడిపి ఎన్నిక‌ల ప్ర‌చారానికి శ్రీ‌కారం చుడ‌తారు.. ఇక అదే రోజు టిడిపి ఫైన‌ల్ జాబితా విడుద‌ల చేసే అవ‌కాశాలున్నాయి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *