బిజెపికి అధికారం వస్తే ప్రధాని మోది కారు : శరద్‌ పవార్‌

ముంబై: కేంద్రంలో మళ్లీ భారతీయ జనతా పార్టీయే అధికారంలోకి వస్తుందని కాని మోది ప్రధాని కారని ఎన్‌సిపి అధినేత శరద్‌ పవార్‌ అన్నారు. బిజెపికి మెజారీటీ రాదని, కానీ అతిపెడ్డ పార్టీగా బిజెపి అవతరిస్తుందని ఆయన చెప్పుకొచ్చారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ ఈ విధంగా వ్యాఖ్యానించారు. రాబోవు ఎన్నికలపై శరద్‌ పవార్‌ను ప్రశ్నించగా దానికి ఆయన సమాధానంగా..బిజెపికి సొంతంగా మెజారిటీ రాదని తాను భావిస్తున్నట్లు, ఐతే దేశంలో బిజెపి అతిపెద్ద పార్టీగా అవతరిస్తుందని ,అతిపెద్ద పార్టీగా అవతరించే పార్టీకే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉంటుంది కానీ ప్రధానిగా మోదిని ఎన్నుకునే అవకాశం ఉండదు అని అన్నారు. ఎన్నికల తర్వాత మనందరం కొత్త ప్రధానిని చూస్తామని, మోదికి మరో అవకాశం లేదని పవార్‌ అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *