యాంకర్ రవి అరెస్ట్

బుల్లితెర ఫై యాంకర్ గా గుర్తింపు తెచ్చుకున్న రవి..అరెస్ట్ అయ్యాడు. బాకీ వసూలు కోసం రవి తనను ఫోన్ చేసి బెదిరించాడని, 20 మందితో కలిసి ఇనుపరాడ్లతో తనపై దాడికి ప్రయత్నించాడని సందీప్ అనే సినీ పంపిణీదారుడు ఎస్సార్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేయడం తో కేసు నమోదు చేసిన పోలీసులు రవి ని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

గతంలో కూడా పలు వివాదాలతో రవి పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కిన సంఘటలను ఉన్నాయి. ఇప్పుడు మరో వివాదం తో వార్తల్లో నిలిచాడు. ఇప్పుడిప్పుడే వరుస అవకాశాలతో మంచి పేరు వస్తున్న సమయంలో ఇలాంటి వివాదాలు ఏంటి అని బుల్లితెర ప్రేక్షకులు భావిస్తున్నారు. రవి కేవలం బుల్లితెర ఫైనే కాదు వెండితెర ఫై కూడా హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. మత్స్య క్రియేషన్స్ పతాకంపై అయోధ్య కార్తీక్ అనే నూతన దర్శకుడు దర్శకత్వంలో “ఇది మా ప్రేమ కథ” అనే చిత్రం తో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. కానీ ఈ సినిమా ఆకట్టుకొనేలా లేకపోవడం తో ప్రేక్షకులు ఈ చిత్రం వచ్చిన సంగతి కూడా మరచిపోయారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *