టాలీవుడ్ లో టైటిల్ పై ఇద్ద‌రి మ‌ధ్య యుద్ధం..

టాలీవుడ్ లో మ‌రో వివాదం రేగుతోంది. ఈసారి టైటిల్ పై వివాదంలో ఓ హీరో, నిర్మాత మ‌ధ్య వివాదం తిట్ల దండ‌కం అందుకునే వ‌ర‌కు చేరింది. వివ‌రాల్లోకెళ్తే… యువ హీరో నిఖిల్ – లావ‌ణ్య త్రిపాఠి జంట‌గా ముద్ర అనే సినిమా తెర‌కెక్కుతోంది. ఈ సినిమాను మార్చిలో విడుద‌ల చేసేందుకు సిద్ధ‌మ‌య్యారు. అయితే, అదే టైటిల్ తో మ‌రో సినిమా విడుద‌ల‌కు సిద్ధ‌మైంది. న‌ట్టి కుమార్ నిర్మాత‌గా జ‌గ‌ప‌తి బాబు న‌టుడిగా ఈ ముద్ర థియేట‌ర్ల‌లోకి వ‌స్తోంది. అయితే, రెండు టైటిళ్లు ఒక‌టే కావ‌డం, టైటిల్‌లు చూడ‌టానికి కూడా ఒకేలా ఉండ‌టంతో రెండు చిత్రాలు తీస్తున్న వారి మ‌ధ్య వివాదం రేగింది. జ‌గ‌ప‌తిబాబు ముద్ర సినిమాకు సంబంధించి టిక్కెట్ బుకింగ్ యాప్ ల‌లో పొర‌పాటున నిఖిల్ పేరు వ‌చ్చింది.

ఇద్ద‌రి మ‌ధ్య మాట‌ల యుద్ధం
దీంతో ఈ సినిమా త‌న‌ది కాద‌ని, త‌న పేరు పెట్టుకోని డ‌బ్బులు సంపాదించాల‌నుకుంటున్నార‌ని హీరో నిఖిల్ సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశాడు.దీనిపై న‌ట్టి కుమార్ తీవ్ర స్థాయిలో ఫైర్ అవుతున్నాడు. త‌ను ముందుగా రిజిస్ట‌ర్ చేసుకున్న టైటిల్ తో నిఖిల్ సినిమా చేస్తున్నాడ‌ని.. నిఖిల్ పేరుతో డ‌బ్బులు సంపాదించుకోవాల్సిన ఖ‌ర్మ త‌న‌కు ప‌ట్ట‌లేద‌ని కౌంట‌ర్ ఇచ్చాడు. దీంతో ఇద్ద‌రి మ‌ధ్య మాట‌ల యుద్ధానికి తెర‌లేచింది. ఒక‌రి చరిత్ర ఒక‌రు బ‌య‌ట‌పెట్టుకుంటామ‌ని స‌వాల్ చేసుకుంటున్నారు. చూడాలి ఈ వివాదం ఎంత‌వ‌ర‌కు వెళుతుందో.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *