20 ఏళ్ళు ఐనా తగ్గని తొలిప్రేమ క్రేజ్, మరోసారి సంచలనం సృష్టించిన పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పుడంటే జనసేన అధినేతగా పొలిటికల్ టర్న్ తీసుకున్నారు కాని.. అప్పట్లో ఆ నవ్వు.. ఆ స్టైల్.. ఆ మేనరిజం ఆయన్ని పవర్ స్టార్‌ని చేసింది. అమ్మాయిల మనసుల్లో గూడు కట్టుకునే చేశాయి ఆయన నటించిన సినిమాలు. అందుకే ఆయన సినిమా అంటే ఇప్పటికీ అదే క్రేజ్.. అవే రికార్డులు.. ఇప్పుడే కాదు.. ఇంకో పదేళ్లు ఆగి సినిమా తీసినా పవర్ స్టార్ దెబ్బకి బాక్సాఫీస్ బద్దలైపోవడం ఖాయమే అనేందుకు ఇదో చక్కని ఉదాహరణ. 

జెనరేషన్‌తో సంబంధం లేకుండా కొన్ని సినిమాలు ఎప్పుడు వచ్చినా టీవీలకు అతుక్కుపోయేట్టు చేస్తాయి. వాటిలో పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎవర్ గ్రీన్ మూవీ ‘తొలిప్రేమ’ ఒకటి. ప్రముఖ దర్శకుడు కరుణాకరణ్ దర్శకత్వం వహించిన తొలిచిత్రం ‘తొలిప్రేమ’ వచ్చి ఇప్పటి ఇరవై ఏళ్లు అవుతుంది. అయితే ఈ సినిమా ఇటీవల స్టార్ మాలో ప్రసారం కాగా అదిరిపోయే రేటింగ్‌తో పాటు.. ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. అంతేకాదు.. #TholiPremaonStarMAA, #TholiPrema హ్యాష్ ట్యాగ్‌లతో క్లాసికల్ హిట్ మూవీపై ఉన్న ప్రేమను చాటుకున్నారు మూవీ లవర్స్. 

ఇప్పటికే జెమినీ, జీ ఛానల్స్‌లో బోలెడు సార్లు తొలిప్రేమ చిత్రాన్ని ప్రసారం చేశారు. తాజాగా ఈ చిత్ర ప్రసార హక్కుల్ని సొంతం చేసుకున్న స్టార్ మా వాళ్లు డిజిటల్ హెచ్ డీ క్వాలిటీతో ఈ సినిమాను గత ఆదివారం నాడు టెలికాస్ట్ చేయగా.. ‘తొలిప్రేమ’ చిత్రానికి ఫిదా అయిన ప్రేక్షకులు ఈ మూవీ స్క్రీన్స్ షాట్స్‌ను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. ఓ కొత్త సినిమాని చూస్తున్న అనుభూతి పొందుతున్నాం అంటూ తెగ ఎంజాయ్ చేశారు. ఇక యూట్యూబ్‌లో ‘తొలిప్రేమ’ చిత్రం అందుబాటులో ఉండగా.. ఇప్పటికి 5 మిలియన్ వ్యూస్‌ని రాబట్టింది. ఈ చిత్రంలో పవన్ సరసన కీర్తిరెడ్డి నటించగా.. తమిళ మ్యూజిక్ డైరెక్టర్ దేవ ఎవర్‌గ్రీన్ మ్యూజికల్ హిట్ సాంగ్స్ అందించారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *