పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఆకాష్ పూరి ‘రొమాంటిక్‌’ హీరోయిన్‌..

ఆకాష్ పూరిఆంధ్రాపోరి సినిమాతో హీరోగా పరిచయం అయి.. ఆ తరువాత పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన మెహబూబా సినిమాలో నటించిన విషయం తెలిసిందే. ఈ సినిమాకు పూరీ జగన్నాథ్‌ దర్శకత్వం వహించారు. ఇండియా-పాకిస్థాన్‌ యుద్ధ సమయంలో ఓ జంట ప్రేమలోపడే కథాంశం చుట్టూ ఈ చిత్రం సాగుతుంది. నేహా శెట్టి హిరోయిన్‌గా చేశారు.  ఈ సినిమాలో ఆకాశ్‌ నటనకు మంచి స్పందన లభించింది.  ఈ చిత్రం మంచి టాక్‌ అందుకున్నప్పటికీ బాక్సాఫీసు వద్ద అనుకున్నంత స్థాయిలో వసూళ్లు సాధించలేకపోయింది.  ఈ రెండు సినిమాలు ఆకాష్‌కు ఆశించిన స్థాయి గుర్తింపు తీసుకురాలేదు.

దీంతో మూడో సినిమా విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నారు పూరి. అందులో భాగంగా.. మరోసారి పూరి స్వయంగా నిర్మిస్తూ కథా కథనాలు అందిస్తూ.. ‘రొమాంటిక్‌’ సినిమాను రూపొందిస్తున్నాడు.

రొమాంటిక్‌’ సినిమాలో హీరోయిన్‌ ఖరారయ్యారు. ఈ సినిమాలో ఆకాష్‌కు జోడిగా కొత్తమ్మాయిని పరిచయం చేస్తున్నారు పూరి. కేతిక శర్మ అనే మోడల్‌ ఆకాష్‌ సరసన హీరోయిన్‌గా నటించనుందని తెలిపారు. సోమవారం గోవాలో ప్రారంభమైన షెడ్యూల్‌లో కేతిక పాల్గొనున్నారని నిర్మాత చార్మీ వెల్లడించారు.  ఇది కేతికా శర్మాకు తొలి సినిమా కావడం విశేషం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *