‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’ విడుదలకు బ్రేక్ పడిందా..?

రామ్‌గోపాల్‌ వర్మ తెరకెక్కించిన ‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’ సినిమాని నిలిపివేయాలని కోరుతూ కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు అందింది. ఈ మేరకు టీడీపీ కార్యకర్త దేవీబాబు ఈసీని కలిసి ఫిర్యాదు చేశారు. ఏపీలో జరగనున్న ఎన్నికలపై ప్రభావం చూపేలా ఈ సినిమా ఉందని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ నెల 22న విడుదల కానున్న ఈ సినిమాని ఆపాలని కోరారు. సినిమాలో సీఎం చంద్రబాబు పాత్రను నెగిటివ్‌గా చూపించారని, ఈ సినిమా ఓటర్లపై ప్రభావం చూపుతుందని అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎన్నికలు పూర్తయ్యే వరకు ఈ సినిమా విడుదలను నిలిపివేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ ఫిర్యాదు కాపీని స్వీకరించిన కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు.. పరిశీలన కోసం రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి పంపారు. మరి ఈ ఫిర్యాదుపై ఎన్నికల సంఘం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *