రామ్‌గోపాల్ వ‌ర్మ చిక్కుల్లో ప‌డ్డట్లేనా..?

వివాదాస్ప‌ద ద‌ర్శ‌కుడు రామ్‌గోపాల్ వ‌ర్మ‌కు కోర్టులు, కేసులూ కొత్తేమీ కాదు. అయితే, ఆయ‌న తాజాగా ల‌క్ష్మీస్ ఎన్టీర్ చిత్రాన్ని తెర‌కెక్కిస్తూ మ‌రో వివాదాన్ని త‌ల‌కెత్తుకున్నారు. ఈ చిత్రంలో ఎవ‌రిని టార్గెట్ చేస్తారో ఆయ‌న టైటిల్‌ని బ‌ట్టే అంద‌రూ ఒక అంచ‌నాకు వ‌చ్చారు. ఇక‌, వెన్నుపోటు అనే పాట విడుద‌ల చేయ‌డం ద్వారా నేరుగా ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడును టార్గెట్ చేసిన‌ట్లు స్ప‌ష్ట‌మ‌య్యింది. ఈ పాట‌పై తీవ్రంగా మండిప‌డ్డ తెలుగుదేశం పార్టీ నేత‌లు పోలీస్ స్టేష‌న్ల‌లో ఫిర్యాదులు ఇచ్చి, రామ్‌గోపాల్ వ‌ర్మ దిష్టిబొమ్మ‌లు కాల్చి వ‌దిలేశారు. ఎన్నిక‌ల వేళ ఈ చిత్రం విడుద‌లైతే టీడీపీకి ఇబ్బందిక‌ర‌మైన ప‌రిస్థితి వ‌స్తుంది. దీంతో ఆ పార్టీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వ‌ర్మ హైకోర్టును ఆశ్ర‌యించారు. దీంతో చిత్ర ద‌ర్శ‌కుడు ఆర్జీవీ, నిర్మాత రాకేష్ రెడ్డి, సెన్సార్ బోర్డుకు కోర్టు నోటీసులు జారీ చేసింది. నాలుగు వారాల్లో కౌంట‌ర్ దాఖ‌లు చేయాల‌ని ఆదేశించింది. ఓ వైపు చిత్రీక‌ర‌ణ వేగంగా జ‌రుపుకుంటున్న ఈ చిత్రానికి కోర్టు రెడ్ సిగ్న‌ల్ వేస్తే రామ్‌గోపాల్ వ‌ర్మ చిక్కుల్లో ప‌డ్డ‌ట్లే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *