కాచిగూడలో చైన్ స్నాచింగ్

హైదరాబాద్: నగరంలోని కాచిగూడ తిలక్‌నగర్‌లో ఆదివారం ఉదయం చైన్ స్నాచింగ్ జరిగింది. రహదారిపై నడుచుకుంటూ వెళుతున్న ఓ మహిళ మెడలోంచి బంగారు గొలుసును బైక్‌పై వెనుకనుంచి వచ్చిన ఇద్దరు దుండగులు లాక్కెళ్లారు. అయితే… ఆమె వెంటనే కేకలు వేసినప్పటికీ అప్పటికే దుండగులు వెళ్లిపోయారు. జరిగిన సంఘటనను వివరిస్తూ బాధిత మహిళ కాచిగూడ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా దుండగులను గుర్తించే పనిలో ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *