యూరోప్, US నుండి ఇండియాకు వచ్చే ఎయిర్ లైన్స్ కు పాక్ అనుమతి నిరాకరణ

పాకిస్థాన్: పుల్వామా దాడికి ప్రతీకారంగా భారత ప్రభుత్వం పాకిస్థాన్‌పై దాడులకు దిగింది. జైషే మహమ్మద్ రక్షణ శిబిరాలను ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నేలమట్టం చేసింది. మరోపక్క పాకిస్థాన్ కూడా దాడులతోనే సమాధానమివ్వాలని నిశ్చయించుకుంది. భారత సైనికుల శిబిరాలపై వరుస దాడులకు పాల్పడుతోంది. అంతటితో ఆపకుండా పాకిస్థాన్‌లోని ఎయిర్‌‌పోర్టులలోకి విదేశీ విమానాలు ప్రవేశించకుండా నిషేధించింది. ప్రస్తుతం ఈ నిషేధం ఫిబ్రవరి 28 వరకు ఉండగా..మరిన్ని రోజులు దీన్ని పెంచే పరిస్థితులు కనపడుతున్నాయి.

ఈ కారణంగా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. భారత్, ఇతర దేశాలకు చెందిన విమానాలను నిషేధించడంతో అమెరికా, యూరప్ నుంచి ఇండియా..ఇండియా నుంచి యూరప్, అమెరికా వెళ్లే విమానాలకు అంతరాయం కలుగుతోంది. అమెరికా, యూరప్ నుంచి ఢిల్లీ చేరుకునే విమానాలను అహ్మదాబాద్, ముంబాయి నుంచి వచ్చేలా రీరూట్ చేసిన్టటు ఓ అధికారి తెలిపారు. యూఎస్, యూరప్ నుంచి ఇండియాకు వచ్చే విమానాలు టెక్నికల్ రిక్వైర్‌మెంట్స్ కారణంగా దుబాయి, షార్జాకు డైవర్ట్ చేసినట్టు అధికారి చెప్పారు. సాధారణంగా ఈ విమానాలు ఆఫ్గనిస్తాన్, పాకిస్థాన్ మీదుగా ఇండియా చేరుకునేవని తెలిపారు.

తాము ఏ ఒక్క విమానాన్నీ రద్దు చేయడం లేదని..కేవలం ప్రయాణ సమయం మాత్రం మరింత పెరుగుతోందని స్పష్టం చేశారు. పాకిస్థాన్ నిర్ణయంతో అమెరికా, యూరప్, ఇండియా, సింగపూర్ ఇతర దేశాల్లో అనేక విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. పాకిస్థాన్ మీదుగా రావాల్సిన, పోవాల్సిన విమానాలను వేరే దేశానికి డైవర్ట్ చేసి గమ్యస్థానాలకు చేరుకునేలా ఆయా విమాన సంస్థలు చర్యలు తీసుకుంటున్నాయి.   

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *