ఇర్ఫాన్ పఠాన్ కామెంట్ తో పవన్ అభిమానుల నుంచి విపరీతమైన రెస్పాన్స్..

మన తెలుగు సినీ హీరోల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు ఉన్న క్రేజ్ ఇతర హీరోలతో పోలిస్తే కాస్త భిన్నంగానే ఉంటుందని చాలా మంది చెప్తుంటారు. ఎందుకంటే టాక్ తో సంబంధం లేకుండా అతని ప్రతీ ఒక్క సినిమా డే వన్ రికార్డుల యొక్క గ్రాఫ్ చూస్తేనే పవన్ క్రేజ్ ఏ రేంజ్ లో ఉంటుందో అర్ధమవుతుంది. సినిమా సినిమాకి క్రేజ్ పెరగడం తప్ప తగ్గడం జరగదని పవన్ అభిమానులు చెప్తుంటారు..అయితే ఇప్పుడు పవన్ క్రేజ్ క్రికెటర్ల వరకు చేరిపోయింది. అందులో పెద్ద గొప్పేమి ఉంది అనుకుంటే పొరపాటే ఎందుకంటే..

పవన్ పేరు చెప్పింది మన రెండు తెలుగు రాష్ట్రాలకి చెందిన క్రికెటర్ కూడా కాదాయే. అతనే భారత జట్టుకి కీలక ఆటగాడిగా బాధ్యతలు నిర్వర్తించిన లెఫ్ట్ హ్యాండెడ్ పేస్ బౌలర్ ఇర్ఫాన్ పఠాన్. మొన్న విజయవాడలోని జరిగినటువంటి ఒక మ్యాచులో ఇర్ఫాన్ పఠాన్ పాల్గొనగా ఆ మ్యాచ్ చూసేందుకు మన వాళ్ళు ఊరుకుంటారా.. “బౌండరీ లైన్ దగ్గర ఫీల్డింగ్ చేస్తున్న ఇర్ఫాన్ పఠాన్ కు వినిపించేలా ఒకరేమో జై జగన్ అని మరొకరు జై జనసేన అని అరుస్తున్నారు. ఎక్కువగా జగన్ పేరునే చెప్తుండగా ఇర్ఫాన్ ఒక్కసారిగా షాకిచ్చారు. జై జగన్ జై జగన్ అంటుండగా ఇర్ఫాన్ మాత్రం “సర్దార్ గబ్బర్ సింగ్” ఓన్లీ అంటూ షాకిచ్చారు”. దీనితో ఈ వీడియో చూసి పవన్ అభిమానులు సోషల్ మీడియాలో తెగ షేర్లు చేసుకుంటూ తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.

వీడియో/ట్వీట్ కోసం క్లిక్ చేయండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *