నాదెండ్ల మనోహర్‌కు ఘన స్వాగతం పలికిన జనసైనికులు

తెనాలి: జనసేన పార్టీలో చేరిన తర్వాత మొట్టమొదటి సారిగా తెనాలి వస్తున్న మాజీ స్పీకర్‌ నాదెండ్ల మనోహర్‌కు ఆయన అభిమానులు, జనసేన కార్యకర్తలు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. పూల వర్షం కురిపించి, మహిళలు హారతులు పట్టారు. నందివెలుగు వద్ద నుంచి తెనాలి వరకు పవన్‌కళ్యాణ్‌ మనోహర్‌తో కూడిన ఫ్లెక్సీలు భారీగా ఏర్పాటు చేశారు.

అధిక సంఖ్యలో పార్టీ అభిమానులు, కార్యకర్తలు వాహనాలతో నందివెలుగు వద్ద ఆయన కోసం వేచి ఉన్నారు. దీంతో పెద్ద ఎత్తున తెనాలి – విజయవాడ ప్రధాన రహదారిపై ట్రాఫిక్‌ తీవ్ర అంతరాయం ఏర్పడింది. గంటల తరబడి వాహనదారులు ఇబ్బంది పడ్డారు. ఒకానొక దశలో అటుగా వెళ్తున్న ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్రప్రసాద్‌కు ట్రాఫిక్‌ చిక్కులు తప్పలేదు. తాలుకా పోలీసులు చొరవ చూపి ఎమ్మెల్యేను ట్రాఫిక్‌ నుంచి బయటకు పంపారు. వందలాది బైక్‌లతో యువత, పార్టీ శ్రేణులు ర్యాలీ నిర్వహించారు. జనసేన నాయకుడు నాదెండ్ల మనోహర్‌ వాహనంపై ప్రజలకు నమస్కరిస్తూ కార్యకర్తలు, అభిమానులతో కరచాలనం చేశారు. కార్యక్రమంలో పార్టీ నేతలు తోటకూర వెంకటరమణరావు, దొడ్డక ఆదినారాయణ, చెన్నుపల్లి రామకృష్ణ, అమ్మిశెట్టి హరికృష్ణ, కొసనా రాంబాబు, మురళి ఉన్నారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *