ఇన్ఫోసిస్ లాంటి సంస్థ‌లు ఈ రాయలసీమకి ఎందుకు రావంటే… : పవన్

జనసేన నాయకులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు రాయలసీమ రైతు సమస్యలపై మాట్లాడుతూ “రాయ‌లసీమ నుంచి ఇంత మంది ముఖ్య‌మంత్రులు అయ్యారు. నాయ‌కులు అయ్యారు. చాలామంది బ‌య‌ట‌ జిల్లాల మీద ప‌డి దోపిడిలు చేస్తార‌న్న‌ చెడ్డ‌పేరు తెచ్చారు. కానీ ఇది చ‌దువుల నేల‌, ఈ నేల సాక్షిగా చెబుతున్నా… అంద‌రికీ విద్య, వైద్యం ఉచితంగా అందించే ఏర్పాటు జ‌న‌సేన ప్ర‌భుత్వం చేస్తుంది. మీ స్వ‌శ‌క్తి మీద మీరు ఆధార‌ప‌డే జీవితాన్ని ఇస్తుంది. జ‌న‌సేన పార్టీ ప్ర‌భుత్వం వ‌స్తే ప్ర‌తి కుటుంబానికి రూ. 10 ల‌క్ష‌ల మెడిక‌ల్ ఇన్సురెన్స్ చేయిస్తాం. ప్ర‌తి విద్యార్ధికి ఫీజు రీఎంబ‌ర్స్‌మెంట్ కాదు. అస‌లు ఫీజు కట్టనవసరం లేని   ప‌రిస్థితులు తీసుకువ‌స్తాం. ప్ర‌తి విద్యార్ధికి ఉచిత బ‌స్ పాస్‌లు ఇస్తాం. బ‌స్సులు అందుబాటులో లేని ప్రాంతాల్లో ప్ర‌త్యేక వాహ‌నాలు ఏర్పాటు చేస్తాం. కాలేజీల ద‌గ్గ‌ర ఉచిత క్యాంటీన్లు ఏర్పాటు చేస్తాం. స్టూడెంట్ పాస్ చూపితే ఉచితంగా భోజ‌నం పెట్టే ఏర్పాటు చేస్తాం. విద్యార్ధుల‌కి స్కిల్ డెవ‌ల‌ప్‌మెంట్ కోర్సుల ద్వారా వారి పాకెట్ మ‌నీ వారే సంపాదించుకునే ఏర్పాటు చేస్తాం. రైల్వే కోడూరు బొప్పాయి, అర‌టి రైతులు పండించిన పంటకి గిట్టుబాటు ధ‌ర వ‌చ్చే వ‌ర‌కు నిల్వ‌చేసుకునేలా స్టోరేజ్ ఫెసిలిటీ ఏర్పాటు చేస్తాం. దేవాల‌యాలు, ప్ర‌ముఖ మ‌సీదుల‌తో నిండిన రాయ‌ల‌సీమ‌ను ప‌ర్యాట‌క ప్రాంతంగా అభివృద్దిప‌రుస్తాం. జ‌న‌సేన ఇచ్చిన ల‌క్ష ఉద్యోగాల హామీలో ప‌ది వేల ఉద్యోగాలు ప‌ర్యాట‌క రంగంలోనే ఇస్తాం. పారిశ్రామిక అభివృద్దికి అవ‌కాశం ఉన్నా రాయ‌ల‌సీమ‌కి ప‌రిశ్ర‌మ‌లు రావడం లేదు . కార‌ణం ఇక్క‌డ ఆస్తులు మొత్తం కొన్ని కుటుంబాల చేతుల్లోనే చిక్కుకుని ఉన్నాయి. ఇన్ఫోసిస్ లాంటి సంస్థ‌లు ఈ ప్రాంతానికి ఎందుకు రావంటే, బ‌య‌టి నుంచి ఎవ‌రైనా సంస్థ‌లు ఏర్పాటు చేద్దామ‌ని వ‌స్తే మ‌న నాయ‌కులు వాటాలు అడుగుతున్నారు. ప్ర‌తిప‌క్షానికి 40 శాతం, అధికార‌ప‌క్షానికి 60 శాతం ఇస్తేనే ప‌రిశ్ర‌మ‌లు ఏర్పాటు చేసుకోనిస్తారు” అని అన్నారు

రైల్వే కోడూరు వేదిక నుంచి ప్ర‌తి స‌మ‌స్య మీదా మాట్లాడుతా.. 200 ఉద్యోగాల కోసం వేచి చూస్తున్న ఉద్యాన విద్యార్ధుల భ‌విష్య‌త్తు గురించి మాట్లాడుతా. హార్టిక‌ల్చ‌ర్ డిప్ల‌మో చేసిన గ్రామీణ యువ‌త అదే గ్రామాల్లో ఉద్యాన కూలీలుగా మారుతున్నారు. మిగులు భూముల్లో వారితో ఆర్గానిక్ ఫార్మింగ్ చేయించ‌డం ద్వారా ఎవ్వ‌రి మీదా ఆధార‌ప‌డ‌ని జీవితాలు వారికి క‌ల్పిస్తాం. ఎర్ర‌చంద‌నం దొంగ‌ల గురించి, శేషాచ‌లం అడ‌వుల్లో ఏడుకొండ‌ల వాడి ఆస్తిని దోచేస్తున్న వారి గురించి కూడా ఇక్క‌డ మాట్లాడాలి. ఏడుకొండ‌ల‌వాడిని దోచిన వాడు ఎవ్వ‌డూ బాగుప‌డ్డ దాఖ‌లాలు ఇప్ప‌టి వ‌ర‌కు లేవు. మంగంపేట ఆంధ్ర‌ప్ర‌దేశ్ మిన‌ర‌ల్ డెవ‌ల‌ప్‌మెంట్ కార్పొరేష‌న్ ఏర్పాటుకి భూములు కోల్పోయిన 300 కుటుంబాల‌కి 2013 భూసేక‌ర‌ణ చ‌ట్టం ప్ర‌కారం ప‌రిహారం అందించాలి. భూములు తీసుకుని ప‌రిహారం ఇవ్వ‌లేక‌పోయారు, ఉద్యోగాలు ఇవ్వ‌లేక‌పోయారు.  ఆ కుటుంబాల‌కి ప‌రిహారం తెప్పించే బాధ్య‌త జ‌న‌సేన పార్టీ తీసుకుంటుంది. ఏ మూల‌కి వెళ్లినా యువ‌త నుంచి ఈ స్థాయిలో మ‌ద్ద‌తు ల‌భిస్తోంది. ఇది నా బ‌లం కాదు. మార్పు కోరుకుంటున్న మీ అంద‌రిది. నేను నా భ‌విష్య‌త్తు కోసం కాదు. మీ అంద‌రి భ‌విష్య‌త్తు కోసం పాటుప‌డుతున్నా అని అన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *