రైతు ఆత్మహత్యపై స్పందించిన పవన్ కళ్యాణ్.. మెచ్చుకుంటున్న ప్రజలు

జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కొన్నిసార్లు స్పందించడం ఆలస్యమైనా స్పదించే తీరు మాత్రం హుందాగా ఉంటుంది. పలు వ్యవహారాల్లో ఆచి తూచి తర్క బద్దంగా స్పందించి తన నేర్పును ప్రదర్శించిన పవన్ తాజాగా అంచలనం రేపిన కొండవీడు రైతు కోటయ్య మరణంపై కూడా అదే రీతిలో స్పందించారు. కోటయ్య మరణం గురించి తెలియగానే టీడీపీ ప్రభుత్వం యొక్క చిన్న చూపు, స్థానిక అధికారుల అనుచిత ప్రవర్తన కారణంగా కోటయ్య చనిపోయాడని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ వ్యవహారానికి కులాన్ని కూడా చేర్చి ఇష్యూ చేశారు.

దానికి ఆయన మీడియా కూడా వంత పాడుతూ నానా హంగామా చేసిందే తప్ప అసలు కోటయ్య మరణానికి గల కారణాన్ని కనుక్కునే ప్రయత్నం చేయలేదు. ఇక టీడీపీ తరపున వాకాల్తా పుచ్చుకున్న లోకేష్ జగన్ మోహన్ రెడ్డిని 420, శవాలపై పేలాలు ఏరుకునే వ్యక్తి, శవ రాజకీయాలు చేస్తారా అంటూ ఇంతెత్తున లేచారు. దీంతో సమస్య కాస్త అధికార, టీడీపీల నడుమ యుద్ధంగా మారిందే తప్ప కన్నుమూసిన రైతు పట్ల సానుభూతి ఏర్పడలేదు. మొత్తంగా ఇరు పార్టీల తీరులో రోడ్డున పడిన ఆ రైతు కుటుంబానికి ఆదుకునే లక్షణాలు కనబడలేదు.

అసలు రైతు మరణానికి కారణం ఏమిటో సరిగ్గా తెలియని ఈ సమయంలో ఆరోపణలకు, ప్రత్యారోపణలు తావివ్వడం సరికాదనుకున్న పవన్ కళ్యాణ్ గారు కోటయ్య మరణంపై సమీక్ష కోసం జనసేన ప్రతినిధులు అక్కడికి వెళుతున్నారు. ప్రభుత్వానికి నేను చెప్పేది ఒక్కటే నష్టపరిహారం ఇచ్చి చేతులు దులుపుకోవద్దు, సానుభూతితో భాద్యత తీసుకోండి అని సూచించారు. ఇలా సమస్యను జఠిలం చేయకుండా శాంతియుత రీతిలో పవన్ స్పందించడాన్ని చూసిన అనేక మంది భాద్యత కలిగిన రాజకీయ నాయకుడి లక్షణాలు ఇవే, నిజం ఏమిటో పూర్తిగా బయటపడని సమస్యపై ఇలాగే హుందాగా మాట్లాడాలి అంటూ మెచ్చుకుంటున్నారు.

కొండ‌వీడులో రైతు కోటయ్య గారి మ‌ర‌ణం గురించి విభిన్న క‌థ‌నాలు వినిపిస్తున్న నేప‌ధ్యంలో స‌మీక్ష కోసం జ‌న‌సేన పార్టీ…

Posted by Pawan Kalyan on Tuesday, February 19, 2019

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *