జనసేన గుంటూరు పశ్చిమ అభ్యర్థి ఖరారు, ఘాటెక్కనున్న గుంటూరు రాజకీయం

నాయకుడు అన్న పదానికి మహాత్మాగాంధీ ఇచ్చిన నిర్వచనం నిత్యం ప్రజలతో కలిసిమెలిసి ఉండడం. అనునిత్యం ప్రజలకు అందుబాటులో ఉండి వాళ్ల ప్రయోజనాలను కాపాడే నిజమైన నాయకుడు. బాపూజీ ఇచ్చిన ఈ నిర్వచనానికి నిజమైన అర్ధం చెప్పేట్లుగా రెండు దశాబ్దాలకు పైగా ఐఏఎస్ అధికారిగా లక్షలాదిమందికి సేవలందించి నిత్యం వారికి అందుబాటులో ఉన్న పాలనాధ్యక్షుడిగా, నిజాయితీ, నిబద్ధత, చిత్తశుద్ధి, ఉన్న సమర్ధవంతమైన అధికారిగా అపురూప సేవలందించి, ప్రముఖ సంఘసేవకుడు అన్నాహజారే ద్వారా అభినందనలు అందుకొని, మహారాష్ట్ర ప్రజల హృదయ సామ్రాట్ బాలథాక్రేచే ప్రశంసలు పొంది, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి విలాసరావు దేశముఖ్ తో కొనియాడబడి, దేశ ప్రధాని మన్మోహన్సింగ్ చే అత్యున్నత పురస్కారాన్ని అందుకున్న అసమాన ప్రజాసేవకుడు, అత్యున్నత ప్రజాధికారి తోట చంద్రశేఖర్. ప్రతిభ, నైపుణ్యం, అవిరళ కృషి చేసే వ్యక్తులకు అత్యున్నత పదవులు తమంతట తామే వరిస్తాయి. దానికి ఉదాహరణే శ్రీ తోట చంద్రశేఖర్ గారు.

22 ఏళ్లుగా అవిరామంగా ప్రజాసేవచేసినా ఇంకా ఆయనకు ప్రజాసేవపై మక్కువ చావలేదు. సమాజం మనకేం చేసింది కన్నా మనం సమాజానికి ఏం చేసాం? అని అనుక్షణం తనకు తాను బేరీజు వేసుకొని మరింత విస్తృతస్థాయిలో సేవ చేయాలనీ మరింత పెద్ద వేదిక ప్రజాసేవ ప్రస్థానాన్ని కొనసాగించాలని రాజకీయ రంగ ప్రవేశం చేసారు.

సమైక్యాభివృద్ధి కోసం పవన్ కళ్యాణ్ గారు చేపట్టిన కార్యక్రమాలు చంద్రశేఖర్ గారిని ఉత్తేజితుల్ని చేసాయి. ఆంధ్రాప్రదేశ్ ను స్వర్ణాంధ్ర ప్రదేశ్ గా అభివృద్ధి చెయ్యడమే లక్ష్యంగా శ్రీ చంద్ర శేఖర్ గారు జనసేనలో చేరి పశ్చిమ గుంటూరు నియోజకవర్గ అభ్యర్థిగా సార్వత్రిక ఎన్నికల్లో అశేష పశ్చిమ గుంటూరు నియోజకవర్గ ప్రజల ఆశీస్సులతో బరిలోకి దిగారు.

ఇదిల ఉండగా, రాబోయే ఎన్నికలలో గుంటూరు పార్లమెంటు సీటు అమరావతి భవిష్యత్తును మార్చబోనుంది. ఈ క్రమంలో ఈ సీటు కొరకు పలువురు నాయకులు పోటీ పడుతున్నారు, తోట చంద్రశేఖర్ గారికి MLA సీటు ఖరారు అవ్వడంతో పార్లమెంటుకు పోటీపడుతున్న ఆశావహుల్లో ఆశలు పెరిగాయి. గుంటూరు పార్లమెంటు అభ్యర్థి రేసులో మొన్నటి వరకు నాదెండ్ల మనోహర్, తోట చంద్రశేఖర్ మరియు మెండు చక్రపాణి గారి పేర్లు వినిపించాయి. ఐతే రెండు రోజుల క్రితం జరిగిన సభలో జనసేనాని పవన్ కళ్యాణ్ గారు మనోహర్ గారిని తెనాలి నియోజకవర్గ MLA గా ఖరారు చేసారు. తోట చంద్రశేఖర్ గారు గుంటూరులో విజయకేతనం ఎగురవేస్తారని కూడా చెప్పారు కానీ ప్రజల్లో మాత్రం MP గానా లేదా MLA గానా అని చిన్న సస్పెన్స్ ఉండిపోయింది.

తాజాగా ఈ రోజు లీకైన జనసేన ప్రెస్ రిలీజ్ లో తోట చంద్రశేఖర్ గారు గుంటూరు నియోజకవర్గ MLA అని ప్రచురించడంతో ఆ సస్పెన్స్ కాస్తా వీడింది. ఇక పార్లమెంటు అభ్యర్థి రేసులో మెండు చక్రపాణి గారు మాత్రమే మిగలడంతో సీటు ఖాయమని విశ్వసనీయ వర్గాలు తెలుపుతున్నాయి. ఫిబ్రవరి నెలలో కచ్చితంగా పార్లమెంటు అభ్యర్థిగా మెండు చక్రపాణి గారిని ప్రకటించే సూచనలు మెండుగా కనపడుతున్నాయి.

మెండు చక్రపాణి గారు కూడా తోట చంద్రశేఖర్ గారి వలె గత రెండున్నర దశాబ్దాలుగా ప్రజాసేవలోనే ఉన్నారు. అప్పట్లో ప్రజారాజ్యం సమయంలోనే చక్రపాణి గారు గుంటూరు ఎంపీ రేసులో సొషల్ మీడియా సర్వేల్లో ముందంజలో నిలిచారు. ఐతే ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో పరోక్షంగా కన్నా ప్రత్యక్ష రాజకీయాల్లో ప్రజాసేవకు మరింత ఆస్కారం ఉందని అలాగే పవన్ కళ్యాణ్ గారు స్థాపించిన జనసేన అన్ని రాజకీయ పార్టీల్లా కాకుండా నూతనమైన ప్రశ్నించే విధానంతో ముందుకు సాగుతుంది. ఇటువంటి వాటిని నిశితంగా పరిశీలించి పరిగణలోకి తీసుకొని చక్రపాణి గారు ప్రత్యక్ష రాజకీయాల్లో జనసేనలో కలిసినట్లు సమాచారం.
ఏదిఏమైనా గాని ప్రస్తుతం జనసేన తరపున గుంటూరు పార్లమెంటు సీటుకు మెండు చక్రపాణి గారు ఎన్నికవడం ఖాయం అని ప్రజల్లో బలమైన విశ్వాసం ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *