మాజీ కార్పొరేటర్ విజయారెడ్డి దారుణ హత్య

విశాఖ : కాంగ్రెస్‌ మాజి కో ఆప్షన్‌ సభ్యురాలు విజయారెడ్డి మంగళవారం దారుణ హత్యకు గురయ్యారు. ఆమె ఉంటున్న అపార్ట్‌మెంట్‌లోని బాత్‌ రూంలో రక్తపు మడుగులో విజయారెడ్డి శవమై కనిపించారు. అక్కయపాలెం ఎన్‌జిజిఒఎస్‌ కాలనీలో ఉన్న పద్మ భాస్కర అపార్ట్‌మెంట్‌లోని 5 వ ఫ్లోర్‌లో విజయారెడ్డి నివాసముంటున్నారు. అపార్ట్‌మెంట్‌ను కొనుగోలు చేయడానికి వచ్చిన వారే విజయారెడ్డిని హత్య చేసి ఉండవచ్చని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకొని విచారణ చేపడుతున్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *