IND vs WI 3rd ODI : మూడో వన్డేలో 43 పరుగుల తేడాతో భారత్‌పై విజయం

భారత పర్యటనలో క్రమంగా పుంజుకుంటున్న వెస్టిండీస్‌ ఆటగాళ్లు మూడో వన్డేలో విజయం సాధించి తమ సత్తాను చాటారు. ఒక పక్క భారత సెలెక్టర్లు ఆటగాళ్ల మార్పులతో ప్రయోగాలు చేస్తూండగా విండీస్‌ జట్టు ఒకే జట్టుతో కొనసాగుతూ భారత పిచ్‌లపై రాటు దేలిం ది. తొలి రెండు వన్డేలో భాగా రాణించిన భారత్‌ బ్యాట్స్‌మన్‌ శనివారం చతికల పడ్డారు. కెప్టెన్‌ కోహ్లీ మళ్లి అద్భుత సాటిలేని ఇన్నింగ్స్‌ ఆడి వన్డేల్లో తన 38వ సెంచరీ నమోదు చేసుకు న్నాడు. అతనికి సహచర ఆటగాళ్ల నుంచి మద్దతు లభించలేదు. ఫలితం ఓటమి. జట్టులోకి వచ్చిన ఫాస్ట్‌ బౌలర్‌ బుమ్రా అద్భుతంగా బౌలింగ్‌ చేసి 35 పరుగులకు 4 వికెట్లు తీశాడు. మిగతా బౌలర్లు దారాళంగా పరుగులిచ్చి విండీస్‌ భారీ స్కోరుకు బాటలు వేశారు. ఐదు వన్డేల సిరీస్‌లో భారత్‌, విండీస్‌ చెరొకటి గెలవగా ఒక మ్యాచ్‌ టైగా ముగిసింది. నాలుగో వన్డే సోమవారం ముంబైలో జరుగనుంది.

అనుకున్నంత అయింది. విండీస్‌ సవాల్‌ విసిరి మూడో వన్డేను గెలుచుకుని తమను తక్కువ అంచనా వేయవద్దని చాటింది. శనివారం మహారాష్ట్ర క్రికెట్‌ ఆసోసియేషన్‌ మైదానంలో జరిగిన మ్యాచ్‌లో విండీస్‌ భారత్‌ను 43 పరుగుల తేడాతో ఓడించింది. కోహ్లీ బ్యాటింగ్‌ను నమ్ముకుని టాస్‌ గెలిచి బౌలింగ్‌ను ఎంచుకున్నాడు. అయితే పరిస్థితి తారుమారైంది. భారత్‌ లక్ష్య ఛేదనలో చతికిల పడింది. విండీస్‌ తన ముందుంచిన 283 పరుగుల లక్ష్యాన్ని కూడా చేరుకోలేక 240 పరుగులకే ఆలౌటయింది. భారీ స్కోర్లకు బాటలు వేస్తారనుకున్న ఓపెనర్లు రోహిత్‌ 8(9బంతులు), శిఖర్‌ ధావన్‌ 35(45బంతులు, ఫోర్లు 5) చేయగా, రెండో వికెట్‌గా క్రీజులోకి వచ్చిన కోహ్లీ మళ్లి సెంచరీ చేసి ఇన్నింగ్స్‌ను గాడిలో పెట్టే ప్రయత్నం చేసినప్పటికి ధావన్‌ ఔట్‌ తర్వాత క్రీజులోకి వచ్చిన వారెవరినుంచి కూడా సహకారం అందలేదు.

చివరికి కోహ్లీ ఏడో వికెట్‌గా 107 (119 బంతులు ఫోర్లు -10 ఒక సిక్సర్‌) పరుగులు చేసి ఔటయ్యాడు. మిడిలార్డర్‌లో అంబటి రాయుడు 22( 27బంతులు, ఫోర్లు 2), రిషభ్‌ పంత్‌ 24(18బంతులు, ఫోర్లు 3 ఒక సిక్సర్‌) ధోని 7(11 బంతులు) పరుగులు చేసి పెవిలియన్‌ చేరడంతో భారత్‌ ఓటమి ఖాయమైంది. లోవర్‌ ఆర్డర్‌లో భువీ 10(17బంతులు ఒక ఫోర్‌), సహా ఎవరూ కూడా విండీస్‌ బౌలర్ల ముందు నిలువలేక పోయారు కుల్దిdప్‌ 15 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.

మొత్తానికి భారత్‌ ఇన్నింగ్స్‌ ఇంకా 16 బంతులు మిగిలి ఉండగానే 240 వద్ద ఆగిపోయింది. అంతకు ముందు బ్యాటింగ్‌ చేసిన విండీస్‌ బ్యాట్స్‌మన్లను బుమ్రా తన పటిష్ట బౌలింగ్‌తో చుక్కలు చూపించాడు. బుమ్రా కీలకమైన విండీస్‌ టాప్‌ ఆర్డర్‌ ను కుప్ప కూల్చాడు. చివర్లో నర్సేను కూడా పెవిలియన్‌ పం పించాడు. విండీస్‌ బ్యాట్స్‌ మన్లలో షాయ్‌ హోప్‌ 95(113 బంతులు, ఫోర్లు 6 సిక్స్‌-3) పరుగులతో రాణించగా, నర్సే 40 పరుగులు (22బం తులు ఫోర్లు 4, సిక్స్‌-2) చేశాడు. మొత్తానికి విండీస్‌ 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 283 పరుగులు చేసింది. భారత బౌలర్లలో బుమ్రా 4 వికెట్లు, కుల్దిప్‌ రెండు, చాహల్‌, ఖలీల్‌ భువీలు తలొక వికెట్‌ను దక్కించుకున్నారు. ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డును ఆశ్లే నర్స్ దక్కించుకున్నాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *