INDvsAUS టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా

భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య ఐదు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో.. చివరిదైన ఐదో వన్డే దిల్లీలో జరుగుతోంది. ఈ సిరీస్‌లో హైదరాబాద్నాగపూర్‌ల్లో జరిగిన తొలి రెండు మ్యాచ్‌లను భారత్ గెల్చుకోగా, తర్వాత రాంచీ, మొహాలీల్లో జరిగిన రెండు మ్యాచ్‌లను ఆస్ట్రేలియా గెల్చుకుంది. దీంతో దిల్లీ వన్డేను ఏ జట్టు గెల్చుకుంటే సిరీస్ ఆ జట్టుదే అవుతుంది.

టాస్ గెలిచిన ఆస్ట్రేలియా జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది.

ఆరు ఓవర్లలో ఆస్ట్రేలియా జట్టు వికెట్లేమీ నష్టపోకుండా 38 పరుగులు చేసింది.

ఓపెనర్లు ఉస్మాన్ ఖవాజా 20 బంతుల్లో ఐదు ఫోర్లతో 23 పరుగులు, ఆరోన్ ఫించ్ 16 బంతుల్లో మూడు ఫోర్లతో 15 పరుగులు చేశారు. వీరిద్దని బ్యాటింగ్ కొనసాగుతోంది.

భారత జట్టులో చాహల్, కేఎల్ రాహుల్‌లకు విశ్రాంతి ఇచ్చారు. జడేజా, షమీలకు చోటు కల్పించారు.

ఆస్ట్రేలియా జట్టులో షాన్ మార్ష్, జాసన్ బెహ్రెన్‌డోర్ఫ్‌లకు విశ్రాంతినిచ్చి, మార్కస్ స్టొయనిస్, నాథన్ లయన్‌లను తీసుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *