ధోనీని కాపీ కొట్టబోయి ఫ్లాప్ అయిన పంత్

వికెట్ల వెనుక ధోనీ ఎంత చురుగ్గా కదులుతాడో.. ఎంత వ్యూహాత్మకంగా వ్యవహరిస్తాడో అందరికీ తెలిసిందే. క్రీజులో ఉన్న బ్యాట్స్‌మెన్ ఏమాత్రం ఏమరుపాటుగా వ్యవహరించినా.. క్షణాల వ్యవధిలో వికెట్లను గిరాటేయగలడు. అందుకే ధోనీ వికెట్ల వెనుక ఉన్నప్పుడు బ్యాట్స్‌మెన్ అప్రమత్తంగా లేకపోతే అంతే సంగతి అంటారు.అంతలా వికెట్ కీపింగ్‌లో తనకంటూ ప్రత్యే స్థానాన్ని సంపాదించుకున్న మహేంద్ర సింగ్ ధోనీ లేని లోటు టీమిండియా నాలుగో వన్డేలో కొట్టొచ్చినట్టు కనిపించింది. కొత్త కుర్రాడు రిషబ్ పంత్ అందివచ్చిన అవకాశాలను జారవిడవడంతో.. కొండంత లక్ష్యాన్ని కూడా భారత్ కాపాడుకోలేకపోయింది.

https://twitter.com/Vidshots1/status/1104775666812243968

స్టంపింగ్ అవకాశాలను చేజార్చిన రిషబ్ పంత్ తీరుపై కెప్టెన్ కోహ్లీ మైదానంలోనే అసహనం వ్యక్తం చేశాడు. పంత్ ఫీల్డింగ్ తప్పిదాలపై సోషల్ మీడియాలోనూ సెటైర్స్ పడుతున్నాయి. భారత మాజీ క్రికెటర్ మహమ్మద్ కైఫ్ సైతం దీనిపై స్పందించాడు. ఇలాంటి సందర్భాల్లోనే వికెట్ల వెనుక ధోనీ విలువేంటో తెలిసి వస్తుందని ట్విట్టర్‌లో పేర్కొన్నాడు. ఇటీవలి కాలంలో భారత్ బౌలింగ్ పరంగా.. ఫీల్డింగ్ పరంగా దారుణంగా విఫలమైన మ్యాచ్ ఇదేనని అభిప్రాయపడ్డాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *