అరుంధతి సినిమాను మరోసారి గుర్తు చేసింది అనుష్క..
అరుంధతి సినిమాను మరోసారి గుర్తు చేసింది అనుష్క..

పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో అక్కినేని నాగార్జున నటించిన సూపర్ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది అనుష్క. ఆ సినిమా తర్వాత తెలుగులో స్టార్ హీరోల సరసన నటిస్తూ అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. అనుష్క ఎప్పుడూ తన నటనకు ప్రాధాన్యమున్న పాత్రలనే ఎంచుకుంటూ ఈ విభిన్నమైన చిత్రాల్లో నటిస్తూ సౌత్ ఇండస్ట్రీలో నెంబర్ వన్ గా నిలిచింది.

g-ప్రకటన

ఈ క్రమంలోనే అరుంధతి, బాహుబలి సినిమాల ద్వారా పాన్ ఇండియా లెవెల్లో హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది అనుష్క. భాగమతి సినిమా తర్వాత అనుష్క కొంతకాలం సినిమాలకు దూరంగా ఉంది. అంతేకాకుండా, అనుష్క సోషల్ మీడియాలో చాలా తక్కువ యాక్టివ్‌గా ఉంటుంది.

ప్రస్తుతం అనుష్క యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై మహేష్ పి దర్శకత్వంలో ఓ కీలక పాత్రలో నటిస్తోంది. ఈ సినిమాలో జాతిరత్నాలు ఫేమ్ నవీన్ పొలిశెట్టి కూడా ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో శరవేగంగా జరుగుతోంది.

కాగా, చాలా కాలంగా సోషల్ మీడియాకు దూరంగా ఉన్న అనుష్క తాజాగా సోషల్ మీడియాలో యాక్టివ్ గా మారింది. ఈ క్రమంలో తన ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్ పిక్ ని కూడా మార్చేసింది. అరుంధతి సినిమాలో జేజమ్మ పాత్రలో చీర, బంగారు ఆభరణాలు, పెద్ద బొట్టుతో ఉన్న ఫోటోని ప్రొఫైల్ పిక్ గా మార్చేసింది.

అయితే చాలా కాలం తర్వాత అనుష్క సోషల్ మీడియాలో యాక్టివ్ గా మారి అరుంధతి సినిమా ఫోటో ప్రొఫైల్ పిక్ పోస్ట్ చేయడంతో అందరూ అరుంధతి సినిమాని గుర్తు చేసుకున్నారు. ప్రస్తుతం అనుష్క షేర్ చేసిన పిక్ వైరల్ అవుతోంది.

Leave a comment

Your email address will not be published.