దర్శకుడిని అరెస్ట్ చేసిన పోలీసులు అసలు స్వరూపం బయటకి..!
దర్శకుడిని అరెస్ట్ చేసిన పోలీసులు అసలు స్వరూపం బయటకి..!

ఏ ఇండ‌స్ట్రీలోకి రావ‌డం క‌ష్టం. సినిమా పరిశ్రమ అంతకు మించినది కాదు. సినిమా అనేది రంగుల ప్రపంచం. అయితే ఇక్కడ నెట్టుకు రావాలంటే టాలెంట్ తో పాటు అదృష్టం కూడా అవసరమనేది అందరికీ తెలిసిన ఫార్ములా. అయితే ఇక్కడ అడుగుపెట్టిన వారు ఎన్నో అవమానాలు చవిచూడాల్సి వస్తుంది. అవకాశాల కోసం ఇక్కడికి వచ్చేవారిని మేకర్స్ చుక్కలు చూడమని ఇప్పటికే చాలా మంది మీడియా ముందు చెప్పిన సందర్భాలు చాలానే ఉన్నాయి.

g-ప్రకటన

యువతుల పరిస్థితి మరీ దారుణంగా ఉందని కొందరు సీనియర్ నటీమణులు అంటున్నారు. కానీ ఈ రోజులు మారాయి. ‘మీటూ’ ఉద్యమం తర్వాత చాలా మంది మహిళలు తమ జీవితంలో ఎదుర్కొన్న చీకటి కోణాలను బయటపెడుతున్నారు. కానీ ఇప్పటికీ అవకాశాల పేరుతో దారుణమైన సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి.

సినిమా ఛాన్స్ ఇప్పిస్తానని చెప్పి యువతుల జీవితాలతో అసభ్యకర సన్నివేశాలు చిత్రీకరిస్తూ వారి జీవితాలతో ఆడుకుంటున్న ఓ దర్శకుడు ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. తమిళనాడులోని సేలంలో వేల్ క్షత్రియ అనే దర్శకుడు యాక్టింగ్ స్కూల్ నడుపుతున్నాడు. తన అసిస్టెంట్ జయజ్యోతితో కలిసి సీక్రెట్ కెమెరాల ద్వారా యువతుల అశ్లీల దృశ్యాలను చిత్రీకరించి యువతులను బ్లాక్ మెయిల్ చేసి తాను చెప్పింది వినాలని సూచించాడు.

అయితే విషయం తెలుసుకున్న యువతి సూరమంగళం మహిళా పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో ఇన్‌స్పెక్టర్ సుబ్బలక్ష్మి, వేల్ క్షత్రియ, అతని అసిస్టెంట్ జయజ్యోతిని అదుపులోకి తీసుకుని విచారించారు. అప్పుడు దర్శకుడు వేల్ క్షత్రియ దారుణాలు వెలుగులోకి వచ్చాయి.

ఈ క్రమంలో పోలీసులు 30కి పైగా హార్డ్ డిస్క్‌లను గుర్తించగా, అందులో 300లకు పైగా అసభ్యకర వీడియోలు, అమ్మాయిల ఫొటోలు దొరికాయి. టెక్నాలజీ ఇంతగా అభివృద్ధి చెందిన నేటికీ ఇలాంటి దారుణమైన ఘటనలు ఆలస్యంగా వెలుగులోకి రావడం నిజంగా బాధాకరం.

Leave a comment

Your email address will not be published.