'ఫ్యామిలీ మేన్' దర్శకులతో విజయ్ దేవరకొండ
‘ఫ్యామిలీ మేన్’ దర్శకులతో విజయ్ దేవరకొండ

ఇటీవల విజయ్ దేవరకొండ ‘లైగర్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా డిజాస్టర్‌గా నిలిచింది. కనీస కలెక్షన్లు కూడా రాలేదు. రెండో రోజు నుంచి ఈ సినిమాను చాలా థియేటర్ల నుంచి తీసేశారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇదిలా ఉంటే.. విజయ్ దేవరకొండ ప్రస్తుతం తన తదుపరి చిత్రాలపై దృష్టి పెట్టాడు.

g-ప్రకటన

ప్రస్తుతం ‘ఖుషి’ సినిమాలో నటిస్తున్నాడు. పూరీ ‘జనగణమన’ మరో సినిమా ఆగిపోయినట్లు సమాచారం. మరోవైపు విజయ్ కొత్త సినిమాలను అంగీకరిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే దిల్ రాజు, అశ్వనీదత్ వంటి నిర్మాతలు విజయ్ తో సినిమాలు చేసేందుకు అగ్రిమెంట్లు కూడా చేసుకున్నారు. ప్రస్తుతం దిల్ రాజు, విజయ్ దేవరకొండ దర్శకుడి అన్వేషణలో ఉన్నారు.

చిత్తూరుకు చెందిన దర్శకులు రాజ్, డీకే బాలీవుడ్‌లో బాగా పాపులర్ అయ్యారు. మరో అగ్ర నిర్మాత అశ్వినీదత్ కూడా విజయ్ కోసం చాలా కథలు వినిపిస్తున్నాడు. చివరకు ఆయన కథ ఓకే అయినట్లు తెలుస్తోంది.

Leave a comment

Your email address will not be published.